మాట మీద నిలబడని రాజకీయ నాయకులు చాలా మందే ఉన్న వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. గత ఎన్నికల ముందు ప్రధాని మోదీని, లోకేష్‌ను, చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇవాళ వారే దేవుళ్లు అంటూ కీర్తించడం చుస్తున్నాం. అలాగే నిత్యం మైక్ కనపడితే చాలు నేను కొత్త రకం రాజకీయాలు చేయడానికి వచ్చా.. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడానికి వచ్చా అని చెప్పే ఆయనే ఇవాళ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలని జనసేన నాయకులకు హితబోధ చేశారు.
ఇవాళ భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని.. ఓట్లు కొంటారా లేదా అనే నిర్ణయం మీరే తీసుకోవాలాని.. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును రూ.45 లక్షలకు పెంచిందన్నారు. కనీసం భోజనాలైనా పెట్టుకుండా పాలిటిక్స్ చేద్దామంటే కుదరదన్నారు. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన డెవలప్ మెంట్ జరుగుతుందన్నారు.
అలాగే చంద్రబాబు కోసం తను పడిన కష్టాన్ని చెప్పుకున్న పవన్ కళ్యాణ్..టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం రెండు చేతులు జోడించి, దండం పెట్టి కేంద్రాన్ని వేడుకున్నానన్నారు. టీడీపీతో పొత్తు అంటేనే బీజేపీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు.. మాటలు పడ్డానన్నారు. పనిలో పనిగా వైసీపీపైన పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. మనుషులను విడగొట్టడమే ఆయన విషసంస్కృతి అన్నారు.