జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలు గడప దాటడం లేదు. తన వరకు వస్తే మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా వైసీపీని గెలవనీయను అంటూ ప్రతిజ్ఞ చేస్తున్న ఆయన తాను నిలబడే నియోజకవర్గం మాత్రం చెప్పలేకపోతున్నారు. ముందు తాను ఏ నియోజకవర్గంలో నిలబడతారో చెప్పి తర్వాత ప్రతిజ్ఞ చేయమంటూ సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయా అనే అవేదన.. వచ్చే ఎన్నికల్లో తను అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే ప్రత్యర్ధుల నుండి వచ్చే మాటలను తట్టుకోవడం తన వల్ల కాదనే భావనతో ఎలగైనా గెలవాలని తన సామాజిక వర్గాన్ని, ఇతర హీరోల అభిమానులను కాకాపడుతూ.. వైసీపీ నేతలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఛాలెంజ్‌లు చేస్తున్నా పవన్ కళ్యాణ్ తను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం మాత్రం చెప్పడం లేదు.
మరో వైపు గతంలో లాగా ఈసారి కూడా గోదావరి జిల్లాలో ఒక చోట, ఉత్తరాంధ్రలో మరో చోట పోటీ చేస్తారా లేక చంద్రబాబు ఒక సీటుకే పరిమితం చేస్తారా అనే విషయం తెలియలి. పొత్తులో భాగంగా పవన్‌కు ఒక సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరో వైపు చంద్రబాబు సర్వేలు చెప్పించి పవన్‌కు అనుకూల సీటును స్వయంగా టీడీపీ అధినేతనే పవన్‌కు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే పవన్ వెనకడుగు వేస్తున్నారంటూన్నారు టీడీపీ నేతలు.
అన్ని మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ముగిసేలోగా తను నిలబడబోయే సీటును స్వయంగా ప్రకటించుకుంటే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందే చెప్పితే వైసీపీ నేతలు తన ఓటమికి ఇప్పటి నుండే పని చేస్తారనే భయం ఆయన్ను వెంటడుతున్నట్లు కనిపిస్తోంది. ముందే చెప్పకపోతే వచ్చే నష్టం కంటే చెప్పితే తనకు జరగబోయే నష్టం గురించి వేల పుస్తకాలు చదివినా పవన్‌కు తెలియదా అంటూ మరోవైపు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.