పాపం పవన్! కాళ్లు కూడా పట్టుకుంటారేమో!?

పవన్ కల్యాణ్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా చంద్రబాబునాయుడు పల్లకీ మోయించాలనే కృతనిశ్చయంతోనే పనిచేస్తున్నారు. అందుకు ఎంత కష్టం పడాల్సి వచ్చినా సరే ఆయన వెనుకాడే స్థితిలో లేరు.…

పవన్ కల్యాణ్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా చంద్రబాబునాయుడు పల్లకీ మోయించాలనే కృతనిశ్చయంతోనే పనిచేస్తున్నారు. అందుకు ఎంత కష్టం పడాల్సి వచ్చినా సరే ఆయన వెనుకాడే స్థితిలో లేరు. పొత్తులకు బిజెపిని ఒప్పించడానికి ఆయన నానాకష్టాలు పడుతున్నారు.

బుధవారం కూడా మళ్లీ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. బిజెపిని పొత్తుల్లోకి తీసుకురావడం గురించి చంద్రబాబు కంటె ఎక్కువ పట్టుదల పవన్ కే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అవసరమైతే బిజెపి పెద్దల కాళ్లు పట్టుకోడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారేమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.

నిజానికి బిజెపి ఓటు బ్యాంకు మీద పవన్ కు అంత గురి ఏమిటో గానీ.. వారికోసం తపన పడుతున్నట్టుగా ఆయన గతంలో బహిరంగ సభలోనే వెల్లడించారు. చంద్రబాబునాయుడుతో పొత్తులకు కేంద్రంలోని బిజెపిని ఒప్పించడానికి ఎన్నో అవమానాలు పడ్డానని, తిట్లు తిన్నానని కూడా ఆయన వేదికమీదినుంచే చెప్పారు.

నిజానికి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు లాంటి మోసగాడితో మళ్లీ కలవం అని బిజెపి పెద్దలు దృఢంగా ఉండేవారా? అందుచేతనే వారిని ఒప్పించడానికి పవన్ అవమానాలు ఎదుర్కోవాల్సిన, తిట్లు తినాల్సిన అవసరం వచ్చిందా అనే అనుమానాలు ఆయన మాటల వల్ల ప్రజలకు కలిగాయి. మొత్తానికి నేడో రేపో పొత్తు ప్రకటన వచ్చేస్తుందంటూ పవన్, చంద్రబాబు ఇద్దరూ ప్రకటించారు గానీ.. అటు బిజెపి వైపునుంచి మాత్రం చప్పుడు కూడా లేదు. వారుపట్టించుకోవడం లేదు.

భారతీయ జనతా పార్టీ తన పాటికి తాను మొత్తం 175 అసెంబ్లీ స్తానాలకు, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించే కసరత్తును తుదిదశకు తీసుకువెళ్లింది. పొత్తుల గురించిన ప్రస్తావన వారి పార్టీ అంతర్గత చర్చల్లో వినిపించడం లేదు. ఇలాంటి దీనస్థితిలో.. పవన్ కల్యాణ్ మళ్లీ ఒకసారి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. బిజెపి పెద్దలను ఒప్పించడానికి ఆయన ప్రయత్నించే అవకాశం ఉంది.

అయితే భారతీయ జనతా పార్టీ అనేది, జనసేనలాగా గాలివాటు పార్టీ కాదు. వారికి స్థిరమైన సిద్ధాంతాలు, వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు గెలిచి, ఒకటో అరో మంత్రి పదవులు దక్కించుకుని సాధించేదేం లేదని వారికి తెలుసు. అదే సమయంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఉన్న క్రేజ్, రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పెరిగిన ఆదరణను వాడుకుంటూ రాష్ట్రమంతా పోటీచేసినట్లయితే.. వచ్చే ఎన్నికల నాటికి తామే సొంతంగా రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా అవతరించగలం అనేది వారి నమ్మిక.

అప్పటికి జమిలి ఎన్నికలు ఉంటాయని అనుకుంటున్న నేపథ్యంలో.. అది బిజెపికి పెద్ద ఎడ్వాంటేజీ అవుతుంది. మరి.. అంత నిర్దిష్టమైన ఆలోచనతో వెళుతున్న భారతీయ జనతా పార్టీని, ఆత్మహత్యా సదృశమైన స్థాయిలో చంద్రబాబుతో పొత్తులకు ఒప్పించడానికి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎన్ని పాట్లు పడాలో ఏమో?