మాన‌సిక స్థితి స‌రిగా లేనిది… ప‌వ‌న్‌కా? జ‌గ‌న్‌కా?

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కంటే ఒక శ‌త్రువుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూస్తున్నారు. ఎంత‌గా అంటే జ‌గ‌న్ చావును కోరుకునేంత‌గా. జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోసారి సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఘాటు…

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కంటే ఒక శ‌త్రువుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూస్తున్నారు. ఎంత‌గా అంటే జ‌గ‌న్ చావును కోరుకునేంత‌గా. జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోసారి సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్‌పై ప‌వ‌న్ అక్క‌సుకు ఈ కామెంట్సే నిద‌ర్శ‌నం. “ప్ర‌జలకు కోపం వ‌స్తే నిన్ను కొట్టి చంపేస్తారు జ‌గ‌న్‌. అప్పుడు ఎవ‌రి చేతుల్లోనూ ఏమీ వుండ‌దు” అని ప‌వ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ మాన‌సిక స్థితిపై కూడా ఆయ‌న భారీ డైలాగ్‌లే కొట్టారు.

“జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగా వుందో లేదో నిర్ధారించుకోవాలి. ఆయ‌న‌ది మాన‌సిక బ‌లం కాదు. పిచ్చి అంటారు. వైసీపీ నాయ‌కులు ఆయ‌న్ను సైకియాట్రిస్టుకు చూపిస్తే మేలు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఎవ‌రైనా వైద్యుల బృందాన్ని పంపి జ‌గ‌న్ మాన‌సిక స్థితిని ప‌రీక్షించేలా చూడాల‌ని నరేంద్రీ మోదీని అడ‌గాల‌ని అనుకుంటున్నా” అని ప‌వ‌న్ అన్నారు. జ‌గ‌న్‌కు పిచ్చి వుంటే ఆ పార్టీ నాయ‌కులు చూసుకుంటారు. ఎందుకంటే జ‌గ‌న్ మాన‌సిక స్థితి బాగాలేక‌పోతే న‌ష్ట‌పోయేది వైసీపీనే.

జ‌గ‌న్ మానసిక స్థితి స‌రిగా వుంద‌ని, త‌మ‌రి ప‌రిస్థితే బాగాలేద‌ని, ఒక‌సారి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల‌తో చూపించాల‌ని ప్ర‌ధాని మోదీని కోరితే బాగుంటుంద‌ని వైసీపీ నేత‌లు హిత‌వు చెబుతున్నారు. ప‌వ‌న్ మాన‌సిక స్థితి బాగాలేద‌ని చెప్పేందుకు విస్తృత‌స్థాయి స‌మావేశంలో ప‌ర‌స్ప‌రం విరుద్ధమైన రాజ‌కీయ కామెంట్స్ చేయ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన విస్తృత స్థాయి స‌మావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అదేంటంటే…

“రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీతో క‌లిసి వెళ్లాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ కూడా క‌లిసి వ‌స్తుందని ఆశిస్తున్నాం” అని నాదెండ్ల మ‌నోహ‌ర్ తీర్మానాన్ని చ‌దివి వినిపించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగంలో కొన్ని అంశాల్ని వైసీపీ నేత‌లు ప్ర‌త్యేకంగా ఆయ‌న‌కు పిచ్చి అని చెప్ప‌డానికి గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

“మ‌నం ఎన్డీఏలోనే ఉన్నాం. బీజేపీతోనే ఉన్నాం. న‌రేంద్ర మోదీతోనే ఉన్నాం. జ‌న‌సేన ఎప్పుడూ ఎన్డీఏలో భాగ‌మే. మ‌నం ఎన్డీఏ నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు”

“తెలంగాణాలోనూ పోటీ చేస్తాం. అక్క‌డ టీడీపీతో వెళ్లాలా? లేక బీజేపీతో వెళ్లాలా? అన్న‌ది భ‌విష్య‌త్‌లో నిర్ణ‌యిస్తాం”

ఒక‌వైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోదీ మ‌ద్ద‌తుతో తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్లాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించార‌ని చెప్పార‌ని, మ‌రి తీర్మానంలో మాత్రం బీజేపీ క‌లిసి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని ఎందుకు పేర్కొన్నార‌ని నిల‌దీస్తున్నారు. జ‌న‌సేన‌కు, ప‌వ‌న్‌కు ఒక సిద్ధాంతం, రాజ‌కీయ నిబ‌ద్ధ‌త లేవ‌ని, ఏపీలో ఒక‌లా, తెలంగాణ‌లో మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప‌వ‌న్ మాన‌సిక ప‌రిస్థితి బాగా లేద‌నేందుకు ఈ ఉదాహ‌ర‌ణ చాల‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్డీఏలోనే వుంటే, ఆ కూట‌మితో సంబంధం లేని టీడీపీతో అంట‌కాగుతాన‌ని చెప్ప‌డం మాన‌సిక వైక‌ల్యానికి నిద‌ర్శ‌నం కాకుండా మ‌రేంట‌ని వైసీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. జ‌గ‌న్ మాన‌సిక స్థితి గురించి ఆందోళ‌న చెంద‌డం మానేసి, అడ్జెంట్‌గా ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి సైకియాట్రిస్టుల‌కు చూపించుకుంటే బాగుంటుంద‌ని వైసీపీ నేత‌లు హిత‌వు చెబుతున్నారు.