1.జగన్ కొత్త పథకం – జైల్ భరో
2.కొత్త సామెత – బాబొకటి తలచిన జగనొకటి తలచును
3.ఢిల్లీ యాత్ర ఫలితం – లోకేష్‌కి తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వచ్చని అర్థమైంది
4.టీడీపీ అభిమాని ఆవేదన – ఇన్ని స్కిల్స్ వున్న బాబు స్కిల్ డెవలప్మెంట్లో ఇరుక్కోవడమేంటి?
5.పవన్ కొత్త పాట – కలిసి వుంటే కలదు సుఖం
6.ఆంధ్రజ్యోతికి మరోపేరు – చంద్రజ్యోతి
7.కాలం మనది కాకపోతే – తాను కట్టిన జైలులో తాను వుండడం
8.వారు వీరవుతారంటే – జగన్ లండన్‌లో వున్నపుడు బాబు జైల్లో వుండడం
9.జైల్ సెక్యూరిటీ కొత్త పదం – నారా హుషార్
10.విధి వింతలీల – రాజకీయాల్లో దశాబ్దాలుగా వేడి పుట్టించిన చంద్రబాబుకే వేడినీళ్లు లేకపోవడం