మహిళలపై తనకు విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని చాటుకోడానికి జనసేనాని పవన్‌కల్యాన్ పరితపిస్తుంటారు. ఆయన బాధ, ఇబ్బందిని అర్థం చేసుకోదగ్గవే. ఎందుకంటే మెజార్టీ మహిళా లోకం పవన్‌కల్యాణ్‌ను చూసే దృష్టి వేరు. మహిళలపై గౌరవం లేదని, అందుకే వారిని కేవలం శారీరక వాంఛలు తీర్చుకునే వారిగా భావించడం వల్లే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మహిళా లోకం భావన.
అమరావతిలో పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మహిళ కన్నీళ్లు తుడవలేని జగన్ ప్రభుత్వానికి 151 స్థానాలు ఇచ్చి లాభం ఏంటని ప్రశ్నించారు. తనకు అధికారం లేకపోయినప్పటికీ, మహిళల బాధలపై స్పందించే మనసు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తాడేపల్లిలో క్రైమ్ రేటు ఎక్కువగా వుందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవడో కాలరాస్తే చూస్తూ ఊరుకుంటామా? అని ఆయన ప్రశ్నించారు.
శ్రీలక్ష్మి, అయేషా, దిశ, నిర్భయ, సుగాలి ప్రీతి కేసులను చూడాలన్నారు. స్త్రీలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు. సమాజంలో మార్పు మహిళలతోనే సాధ్యమన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంటే ఒక్క మంత్రీ మాట్లాడడంలేదని విమర్శించారు.
మహిళలను గౌరవించడం మన కనీస సంప్రదాయం అని ఆయన అన్నారు. శాంతిభద్రతలు జనసేన పార్టీ దృష్టిలో కీలకమన్నారు. పవన్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇంతకూ శాంతి ఎవరు, భద్రత అనే అమ్మాయిలు ఎవరని నెటిజన్లు ప్రశ్నించారు. విడిచినోడు వీధికి పెద్ద, బరితెగించినోడు బజారుకు పెద్ద అని పవన్ సార్ లాంటి వాళ్ళను చూసే పెద్దలు చెప్పి ఉంటారని చురకలు అంటించారు.
అన్నట్టు మూడు రోజుల క్రితం తన విషయంలో పవన్‌కల్యాణ్ అన్యాయం చేశారని ఓ అందగత్తె వాపోయారు…మూడు ముళ్లు వేయించుకుని, ఏడడగులు నడిచిన మహిళకే న్యాయం చేయలేని జనసేనాని, ఇక సమాజాన్ని ఉద్దరిస్తానంటే నమ్మేదెలా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. మహిళలపై పవన్‌కల్యాణ్ సూక్తులు చెబుతుంటే… వినాల్సి రావడం ఖర్మరా బాబూ అని నెటిజన్లు తమదైన రీతిలో పోస్టులు పెట్టడం గమనార్హం.