ఇంట్లో ఇల్లాలు…వీధిలో ప్రియురాలు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఏపీలో టీడీపీతో, తెలంగాణ‌లో బీజేపీతో ఆయ‌న పొత్తు కుదుర్చుకోవ‌డంపై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో దెప్పి పొడుస్తున్నారు. ఇట‌లీ నుంచి తిరిగి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఏపీలో టీడీపీతో, తెలంగాణ‌లో బీజేపీతో ఆయ‌న పొత్తు కుదుర్చుకోవ‌డంపై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో దెప్పి పొడుస్తున్నారు. ఇట‌లీ నుంచి తిరిగి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ శ‌నివారం చంద్ర‌బాబునాయుడిని ప‌రామ‌ర్శించారు. బాబును ప‌రామ‌ర్శిస్తున్న ఫొటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

“మీ ప‌ని బాగుంద‌య్యా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. మీ య‌వ్వారం ఎట్లుందంటే… ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు అన్న‌ట్టుగా” అని సెటైర్స్ విసురుతున్నారు. రాష్ట్రానికో రాజ‌కీయ పార్టీతో పొత్తు పెట్టుకుని జ‌నానికి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో మీకే తెలియాలంటూ నెటిజ‌న్లు చీవాట్లు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చేసరికి జ‌న‌సేన త‌మ మిత్ర‌ప‌క్ష‌మ‌ని జాతీయ పార్టీ అయిన బీజేపీ అంటోంద‌ని, అందుకే పొత్తు పెట్టుకున్న‌ట్టు చెబుతోంద‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు.

ఎన్డీఏలో భాగ‌స్వామి అయితే, మ‌రి ఆంధ్రాలో బీజేపీతో కాకుండా, టీడీపీతో ప‌వ‌న్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారో స‌మాధానం చెప్పాల‌ని జాతీయ పార్టీని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని చంద్ర‌బాబు నివాసానికి నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ వెళ్లి ప‌రామ‌ర్శించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌ర‌ని నెటిజ‌న్లు అంటున్నారు. అయితే రాజ‌కీయ పార్టీ అన్న త‌ర్వాత ఒక విధానం, సిద్ధాంతం ఉండాల‌ని, అవేవీ లేని పార్టీ ఏదైనా దేశంలో వుందంటే జ‌న‌సేన మాత్ర‌మే అని నెటిజ‌న్లు చీవాట్లు పెడుతున్నారు.

ప‌వ‌న్ క్యారెక్ట‌రే జ‌న‌సేన‌కు అబ్బింద‌ని, ఆయ‌న వ్య‌క్తిగ‌తం జీవితం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన ప‌నిలేద‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. ఇటు చంద్ర‌బాబు, అటు కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌ల‌తో అంట‌కాగ‌డం ద్వారా ప‌వ‌న్‌క‌ల్యాణ్ జనంలోకి ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్నారో స‌మాధానం చెప్పాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. జ‌న‌సేనాని వ్య‌వ‌హార శైలి చూసే వాళ్ల‌కే ఇబ్బందిగా వుంద‌ని, ఆయ‌న మాత్రం ఎలాంటి సిగ్గూ లేకుండా జ‌నంలో తిరుగుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌నే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది.