చంద్ర‌బాబు కోస‌మే ఈ ‘గర్జన’ ట్వీట్లు!

రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోతోంది? అంటే నిజం అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నాయకులు, మేధావులు, ప్ర‌జ‌లు చేస్తున్న హడావుడి చూసి టిడిపి, జనసేనల‌కు భయం ప‌ట్టుకున్న‌ట్లు కనపడతోంది. విశాఖలో…

రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోతోంది? అంటే నిజం అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నాయకులు, మేధావులు, ప్ర‌జ‌లు చేస్తున్న హడావుడి చూసి టిడిపి, జనసేనల‌కు భయం ప‌ట్టుకున్న‌ట్లు కనపడతోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్ప‌డుతోపాటు, అమ‌రావ‌తి రైతుల పేరుతో టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్న‌ మాట‌లతో చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఉంది.

బ‌హుశ ఉత్త‌రాంధ్ర జేఏసీ ఏర్పాటుతో త‌ము రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని చంద్ర‌బాబు నాయుడు ముందుగా త‌న స‌న్నిహితుడు అయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి నిన్న రాత్రి నుండి 'దేనికి గ‌ర్జ‌న‌లు' అనే పేరుతో వ‌రుస ట్వీట్ ల‌తో చేయిస్తున్నారు. ఎందుకు అమ‌రావ‌తి ఒక్క‌టే అభివృధి చెందాల‌ని అనుకుంటూన్నారో చెప్ప‌కుండా ప‌దే ప‌దే అవే మాట‌లు చెప్తుండడంతో ఉత్తరాంధ్ర ప్ర‌జ‌లు టీడీపీ మాట‌లు న‌మ్మ‌డం లేదు. బ‌హుశ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వ‌రుస ట్వీట్లు అమ‌రావ‌తి ఎందుకు అవ‌స‌ర‌మే చెప్పింటే బాగుండేది.

గ‌తంలో 'అమ‌రావ‌తి టూ తిరుప‌తి' పేరుతో చేసిన‌ పాదయాత్రను రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు, నాయ‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకొక‌పొవ‌డంతో కాస్తా మీటింగ్ లు, బూతులుల‌తో ఆ పాద‌యాత్ర జ‌రిగిపోయింది. ఆమ‌రావ‌తి పేరుతో రాయ‌ల‌సీమ‌లోని తిరుప‌తి మీటింగ్ లో చంద్ర‌బాబు నాయుడుతో అన్ని ప్ర‌తిపక్షాలు పాల్గొన్నారు. బ‌హుశ రాయ‌ల‌సీమ‌లో తామ పార్టీల‌కు ఎలాగు డిపాజిట్లు కూడా రావ‌ని అందుకే మీటింగ్ లో పాల్లొన్నారు. 

కానీ ఇప్పుడు 'అమరావతి టూ అరసవల్లి' వ‌ల్ల చంద్ర‌బాబుకు న‌ష్టం జ‌రుగుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. పరిస్ధితి అదుపు త‌ప్పిన‌ట్లు గ్ర‌హించి ప‌వ‌న్ ను రంగంలోకి దింపారు. ఎవ‌రైనా త‌మ ఊరు బాగుప‌డుతుంటే వ‌ద్ద‌నే వారు ఉంటారా అనేది చంద్ర‌బాబు అండ్ కొ కు ఎందుకు ఆర్ధం కావ‌డం లేద‌నేది పెద్ద ప్ర‌శ్న‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు హైద‌రాబాద్ కేంద్రంగా చేసిన త‌ప్పుల‌ను ఎందుకు ఆర్ధం చేసుకోవ‌డం లేద‌ని ఉత్త‌రాంధ్ర మేధావుల నుండి వాస్తున్న వస్తున్న మాట‌లు. 

అంతో ఇంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఉన్న ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి న‌ష్టం జ‌రిగితే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో 23 కాస్తా 3 సీట్లు రావచ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.