టీడీపీతో పొత్తు పొడవగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాబోతున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు, జిల్లా అధ్యక్షులతో పవన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు టీడీపీతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేయబోతున్నారు.
టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఉమ్మడి కార్యచరణపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లపై కూడా జనసేన నేతలు పవన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 నుండి 25 లోపు ఎమ్మెల్యే సీట్లు, 2 నుండి 3 ఎంపీ సీట్లు జనసేనకు కేటాయించబోతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిపై తన పార్టీ నేతలకు పవన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా నిన్న చంద్రబాబును జైల్లో కలిసి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేటి నుండే ఉమ్మడిగా పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. బహుశా రేపటి జనసేన సమావేశం తర్వాత జనసైనికులు కూడా టీడీపీ జెండాలు మోయల్సిందే అంటూ హుకుం జారీ చేయనున్నారు. ఇప్పటికే పవన్ చాలా మీటింగ్‌లో తన అజెండా, తన నిర్ణయాలు నచ్చాక పోతే అలాంటి వారు తనకు అవసరం లేదని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.