నిన్న జైల్లో పురుడు పోసుకున్న జనసేన టీడీపీ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి తలపడునుందనే విషయం అందరికి తెలిసిందే. కాకపోతే తాజాగా టీడీపీ కూటమిని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తోడేళ్ల గూంపుగా పొలుస్తూ అసక్తికరమైన ట్వీట్ చేశారు.
ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరగనున్నాయి.. టీడీపీ తోడేళ్ల మూట వర్సెస్ వైసీపీ సింహం, దురాశ వర్సెస్ ప్రజా సంక్షేమం, యూ టర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత, అస్థిరత వర్సెస్ స్థిరత్వం, అవకాశవాదం వర్సెస్ నిజాయితీ, కుల రాజకీయాలు వర్సెస్ ఐక్యత, క్రోనీ క్యాపిటలిజం వర్సెస్ అందరికీ ప్రయోజనం అంటూనే.. మొత్తం ప్రతిపక్షం వర్సెస్ సీఎం జగన్ అంటూ ట్వీట్ చేశారు.
యూ టర్న్ తీసుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్‌లు బ్రాండ్ అంబాసిడర్‌లు అనే విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు, పవన్‌లు వారికి ఇష్టం వచ్చినట్లు పక్క పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో అయినా, ఏ నోటితో పక్క పార్టీ నాయకులను తిట్టి అదే నోటితో అదే నాయకులను దేవునితో పొల్చడం మనందరికి తెలిసిందే. అలాగే విజయసాయి రెడ్డి చెప్పినట్లు దురాశ, అవకాశవాదం, కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా జనసేన, టీడీపీలు ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రతిపక్షం వర్సెస్ సీఎం జగన్ అని చెప్పడంతో జనసేన-టీడీపీ కూటమిలోకి బీజేపీ కూడా ఎంటర్ అవుతోందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.