ఈడీ విచారణకు వెళ్లకుండా కవితక్క హైడ్రామా!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత కొత్త లిటిగేషన్లు పెడుతున్నారు. ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కావడానికి నో అంటున్నారు. తనను విచారించడానికి ఇది అర్హతలనే ఆమె ప్రశ్నిస్తున్నారు. సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేసి, దానిని…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత కొత్త లిటిగేషన్లు పెడుతున్నారు. ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కావడానికి నో అంటున్నారు. తనను విచారించడానికి ఇది అర్హతలనే ఆమె ప్రశ్నిస్తున్నారు. సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేసి, దానిని కవచం లాగా వాడుకుంటూ ఈడీ విచారణ తప్పించుకోవడానికి కవిత హై డ్రామా నడిపిస్తున్నారు. మహిళలని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని కవిత తప్పుపడుతున్నారు. తద్వారా ఏడి అధికారాలని ఆమె ప్రశ్నిస్తున్నారు.  

నిజానికి సిబిఐ వంటి దర్యాప్తు సంస్థ అయినా సరే అవసరమైన సందర్భాలలో ఇంటికే వచ్చి విచారించడం జరుగుతుంది కానీ, ఈడీ వంటి సంస్థ మాత్రం తమ కార్యాలయానికి పిలిపించుకుని మాత్రమే విచారిస్తుంది అనేది నిపుణులు చెబుతున్న మాట.  

ఎందుకంటే ఈడీ క్వాసి జుడిషియరీ అధికారాలను కలిగి ఉంటుంది గనుక, దానిని ఒక రకంగా న్యాయస్థానం లాగా పరిగణించాల్సి ఉంటుంది. మహిళలు అయినంత మాత్రాన వారి ఇంటికి వచ్చి ఈడీ విచారించడం జరగదు. ఇది ఇంటికి వచ్చి విచారించడం అంటే.. కోర్టును ఇంటికి వచ్చి విచారించమనడం లాంటిదే పని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపద్యంలో, మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడం అనేది తగని పని అంటూ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత వేసిన దావాకు విలువ ఉండకపోవచ్చు అనేది పలువురి అభిప్రాయం. 

కేవలం ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణ ప్రక్రియను మరింత జాగు చేయడానికి ఇది కవిత వేస్తున్న ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. కవిత పాత్ర గురించి నిర్ధారించగల ఇతర నిందితులలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, సుఖేష్ చంద్రశేఖర్ తదితరులు అప్రూవరులుగా మారి ఉన్నారు. తాజాగా మరో కీలక నిందితుడు రామచంద్ర పిళ్లై కూడా  అప్రూవర్ గా మారారు. ఈ నేపథ్యంలో కవితను తాజాగా మరోసారి విచారించడానికి ఈడి నోటీసులు సర్వ్ చేసింది.  

అనేకమంది అప్రూవర్లుగా తయారైన తర్వాత,  విచారణకు హాజరైతే సంకటం తప్పదని కవిత భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ ను  సాకుగా చూపించి విచారణలు ఎగ్గొడుతున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ తేలే వరకు విచారణకు హాజరుకాని కవిత చెబుతుండడం గమనార్హం. లిక్కర్ స్కాం లో తన పాత్ర బయటకు వస్తుందని కవిత భయపడుతుండడానికి ఇది సంకేతం అని ఆమె ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. 

రామచంద్ర పిళ్లే కూడా అప్రూవల్ గా మారడం అనేది కవిత పాత్ర విషయంలో చాలా కీలక పరిణామం అని, ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం అంటూ జరిగితే తెలంగాణ రాజకీయాలలో పెద్ద కుదుపు తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే కవితక్క అరెస్టు భయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.