బాబుకు పవన్ తొలిసాయం ఆ ఎన్నిక నుంచేనా…?

ఏపీలో రెండు కీలక మైన పార్టీలు చేతులు కలిపాయి. అది పొత్తులకు దారితీస్తుందన్నది దాదాపుగా ఖాయమనే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హడావుడిగా విజయవాడ వచ్చి మరీ పవన్ బస చేస్తున్న హొటల్…

ఏపీలో రెండు కీలక మైన పార్టీలు చేతులు కలిపాయి. అది పొత్తులకు దారితీస్తుందన్నది దాదాపుగా ఖాయమనే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హడావుడిగా విజయవాడ వచ్చి మరీ పవన్ బస చేస్తున్న హొటల్ లో ఆయనతో భేటీ కావడం అన్నది ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారికి చూసిన వారికి సాధారణ సమావేశం కాదు అన్నది అర్ధమవుతుంది.

ఇన్నాళ్ళూ బయటకు కలవని తెలవని బంధమేదో వారి మధ్య ఉందని వైసీపీ ఎప్పటి నుంచో చెబుతోంది. ఇపుడు ముసుగు తొలగింది అని కూడా అంటోంది. ఈ భేటీ వల్ల పవన్ కి బాబు నుంచి ఓదార్పు ఎంత మేరకు లభించిందో తెలియదు కానీ చంద్రబాబుకు ఆయన టీడీపీకి పెద్ద  ఎత్తూన ఊపిరి అయితే వచ్చిందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల సర్దుబాట్లు తదితర వ్యవహారాలకు ఇంకా చాలా టైం ఉంది. అయితే ఏపీలో మరి కొద్ది నెలలలో ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో గతానికి భిన్నగా టీడీపీ పోటీ చేస్తోంది. అలా ఏపీలో టీడీపీ పోటీ చేస్తున్న చోట్ల ఇప్పటికే అభ్యర్ధులుగా ఖరారు అయిన వారు జనసేన నుంచి తొలి బోణీగా మద్దతు లభిస్తుందని తెగ సంతోషిస్తున్నారు.

ఒక విధంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తులకు లిట్మస్ టెస్ట్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళా కార్పోరేటర్ ఒకరు పోటీ చేస్తున్నారు. దాంతో పాటు బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరోసారి బరిలో నిలబడతారు అని అంటున్నారు.

న్యాయంగా అయితే జనసేన మిత్రపక్షం అయిన బీజేపీకే మద్దతు ఇవ్వాలి. కానీ బాబు తో కలిపిన పవన్ షేక్ హ్యాండ్ తో టీడీపీ శిబిరంలో మాత్రం మద్దతు తమకే ఉంటుందన్న ఉత్సాహాం కనిపిస్తోందిట. జనసేన మద్దతుతో తమ పార్టీ అభ్యర్ధి విజయం ఖాయమని తమ్ముళ్ళు ధీమాగా చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండూ పోటీలో ఉన్న చోట జనసేన తీసుకున నిర్ణయం బట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ రూట్ ఏంటి అన్నది కచ్చితంగా తెలుస్తుంది అంటున్నారు.