అయ్యో … హోం మినిస్ట‌ర్ అనిత మేడ‌మ్‌!

ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలిగా వంగ‌ల‌పూడి అనిత హ‌డావుడి చేస్తూ, నిత్యం పాజిటివ్‌గా వార్త‌ల్లో నిలిచేవారు. అధికారంలోకి రావ‌డం, మ‌రీ ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వేళా విశేషం ఏమో గానీ, నిత్యం విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నారు. కూట‌మి…

ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలిగా వంగ‌ల‌పూడి అనిత హ‌డావుడి చేస్తూ, నిత్యం పాజిటివ్‌గా వార్త‌ల్లో నిలిచేవారు. అధికారంలోకి రావ‌డం, మ‌రీ ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వేళా విశేషం ఏమో గానీ, నిత్యం విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… చిన్న పిల్ల‌లు, యువతులు, మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులు, హ‌త్యలు జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 74 మంది అమ్మాయిలు బాధితుల‌య్యార‌ని వైసీపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. హోంశాఖ మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత ఏం చేస్తున్నార‌నే నిల‌దీత‌లు అన్ని వైపుల నుంచి వ‌స్తున్నాయి. గ‌తంలో తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా అనిత భారీ విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఇప్పుడు ఆమెని ప్ర‌శ్నించే వాళ్లు కూడా ఎక్కువే.

మ‌రీ ముఖ్యంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అఘాయిత్యం జ‌రుగుతుండ‌డంతో అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌లున్నాయా? మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లాలో బ‌ర్త్‌డే ఫంక్ష‌న్ పేరుతో యువ‌తుల‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌నే వార్త గుప్పుమంది. ఇది ఆందోళ‌న‌ను మ‌రింత పెంచింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో హోంశాఖ మంత్రి అనిత టార్గెట్ అవుతున్నారు. పేరుకే అనిత హోంశాఖ మంత్రి అని, పోలీస్‌శాఖ‌పై పెత్త‌నం అంతా టీడీపీ పెద్ద‌ల‌దే అని ఆ పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. కానీ సాంకేతికంగా అనిత కీల‌క‌మైన మంత్రిత్వ‌శాఖ‌కు బాధ్య‌త వ‌హిస్తుండ‌డంతో అమ్మాయిల‌పై అఘాయిత్యాల విష‌యంలో ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌నే తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి అవుతున్నారు. వీటి నుంచి అనిత ఎలా బ‌య‌ట‌పడుతుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

9 Replies to “అయ్యో … హోం మినిస్ట‌ర్ అనిత మేడ‌మ్‌!”

  1. గత ప్రభుత్వం లో అసలు హోమ్ మినిస్టర్ ఎవరో… జనానికే కాదు… వాళ్ళకి కూడా గుర్తు లేదు

Comments are closed.