ప‌వ‌న్.. నీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడం!

నిన్న జెండా సభలో సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీ- జనసేన అధినేతలపై మాజీ మంత్రి పేర్ని నాని అదే రీతిలో రిప్లై ఇచ్చారు. టీడీపీ- జ‌న‌సేన స‌భ‌లో జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప.. వారికి…

నిన్న జెండా సభలో సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీ- జనసేన అధినేతలపై మాజీ మంత్రి పేర్ని నాని అదే రీతిలో రిప్లై ఇచ్చారు. టీడీపీ- జ‌న‌సేన స‌భ‌లో జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప.. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్ప‌లేద‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు ఎవ‌రూ లొంగ‌ర‌ని వార్నింగ్ ఇచ్చారు. 

ఇవాళ పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే వివేకా హ‌త్య జ‌రిగింద‌ని.. అప్పుడు జ‌గ‌న్‌పై కేసు కాదు క‌దా.. నింద కూడా మోప‌లేదు క‌దా అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు హు కిల్డ్ బాబాయ్ అని అరుస్తున్నాడు.. ముందుగా హు కిల్డ్ ఎన్టీఆర్ గురించి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప‌వ‌న్‌ను చంద్ర‌బాబే పాతాళానికి తొక్కుతాడని ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌నిపించ‌ర‌న్నారు.

ప‌వ‌న్‌పై మాట్లాడుతూ.. 2014లో చంద్ర‌బాబు, మోడీతో స్నేహం.. 2019లో చంద్ర‌బాబు, మోడీతో శ్రతుత్వం.. 2024లో చంద్ర‌బాబు, మోడీతో స్నేహం ఎందుకు చేశావో..  2024లో చంద్ర‌బాబు రాజకీయ దురంధరుడు అయితే 2019 చంద్ర‌బాబు ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. 24 తీసుకుంటే ‘గాయత్రీ మంత్రం’ అయితే.. 10 తీసుకుంటే దశావతారం.. 9 తీసుకుంటే నవగ్రహాలు.. 8 తీసుకుంటే అష్ట దిక్కులు, 7 తీసుకుంటే సప్త ఋషులు అని చెప్పాచ్చు.. కానీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర టికెట్లు అమ్ముకోని క‌థ‌లు చెబుతున్నార‌ని..  ఎవ‌రో రాసించిన స్క్రీప్ట్‌లు మాట్లాడుతూ.. కాపుల ఆత్మ‌గౌర‌వాన్ని దిగ‌జారుస్తున్న‌రంటూ మండిప‌డ్డారు. 

ప‌వ‌న్ త‌నను న‌మ్ముకున్న వాళ్ల‌ను న‌ట్టేట ముంచుతున్నారని.. ప‌వ‌న్ వామ‌నుడు కాదు శ‌ల్యుడు, శికండిలాంటి వాడ‌ని ప‌వ‌న్‌తో జాగ్ర‌త ఉండండి అంటూ జ‌న‌సైనికుల‌ను హెచ్చారించారు. 2024 ఎన్నిక‌ల్లో నీ జెండా.. చంద్ర‌బాబు జెండాను మడత పెట్టడం ఖాయం అని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్ గెలుస్తార‌న్నారు.