ప్రధాని మోదీతో జగన్ దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ చేతిని జగన్ తన రెండు చేతులతో పట్టుకుని నవ్వుతూ పరస్పరం ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదే సందర్భంలో మరోవైపు మోదీ, చంద్రబాబు ఎదురెదురుగా నిలిచి ఉన్న ఫొటో పెట్టారు. మోదీకి చంద్రబాబు నమస్కారం చేస్తుండగా, ప్రధాని మాత్రం నిటారుగా నిలిచిన ఫొటో చక్కర్లు కొడుతోంది.
భారత్ నేతృత్వంలో జీ-20 దేశాల సమావేశాల నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి జగన్, చంద్రబాబు వెళ్లారు.
బాబును మోదీ పక్కకు తీసుకెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారని, బాగా చిక్కిపోయావని ప్రధాని అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేసింది. ప్రజల్లో బాగా తిరుగుతున్నానని చంద్రబాబు సమాధానం ఇవ్వగా, ఆ విషయమై తనకు సమాచారం ఉన్నట్టు ప్రధాని అన్నారని సదరు మీడియా రాసుకొచ్చింది.
జగన్ను ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోనట్టు ఎల్లో మీడియా విస్మరించింది. ఈ నేపథ్యంలో జగన్పై ప్రధాని అభిమానం ఏ రేంజ్లో వుందో చాటి చెప్పేందుకు వైసీపీ సోషల్ మీడియా ఓ చక్కటి ఫొటోను తెరపైకి తెచ్చింది.
జగన్కు మోదీ దగ్గరగా వచ్చి, పరస్పరం చేతిలో చేయి వేసి సంభాషించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఈ ఫొటో టీడీపీ కుళ్లుకునేలా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నమస్కారం చేస్తున్నా, ప్రధాని మాత్రం పట్టించుకోలేదనే సంగతిని ప్రతిబింబించే ఫొటో కూడా తెరపైకి వచ్చింది.
మొత్తానికి పిక్ ఆఫ్ ది డేగా జగన్, మోదీ కరచాలనం ఫొటో నిలిచింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.