రుషికొండ చుట్టూ రాజకీయం

విశాఖకు తలమానికం లాంటిది రుషికొండ. ఇక్కడ ఎత్తుగా ఒక రుషిలా ఉండే ఈ కొండ మీద నుంచి చూస్తే  పచ్చని ప్రకృతి, మరో వైపు నీలి సంద్రం కనిపిస్తాయి. టూరిజం స్పాట్స్ లో విశాఖలో…

విశాఖకు తలమానికం లాంటిది రుషికొండ. ఇక్కడ ఎత్తుగా ఒక రుషిలా ఉండే ఈ కొండ మీద నుంచి చూస్తే  పచ్చని ప్రకృతి, మరో వైపు నీలి సంద్రం కనిపిస్తాయి. టూరిజం స్పాట్స్ లో విశాఖలో రుషికొండ కూడా ఒకటి. ఏడాది పొడవునా రుషికొండకు పర్యాటకుల తాకిడి అలా ఉంటూనే ఉంటుంది.

అయితే రుషికొండ ఇపుడు ఏపీ రాజకీయానికి దినుసు అయిపోయింది రుషికొండకు  వైసీపీ పెద్దలు గుండు కొట్టించేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన హాట్ కామెంట్స్ దానికి వైసీపీ ధీటుగానే బదులిచ్చింది. బంగారం లాంటి కొండ అలాగే ఉంది.

అక్కడ అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు తీసుకునే చేస్తున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవంతి శ్రీనివాసరావు కొండలను పిండి చేసే కల్చర్ టీడీపీదే అనేశారు. తమకు అలాంటివి అలవాటూ లేదు, పొరపాటున కూడా ఆ పనులు చేయబోమని అన్నారు.

రుషికొండ మీద టూరిస్టుల కొసం రిసార్ట్స్ ని ప్రభుత్వం నిర్మాణం చేపట్టడానికి తలపడితే దాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కోర్టులలో కేసులు వేయించి మరీ ఏపీ జరగకుండా చూస్తున్నారని మండిపడ్డారు. 

విశాఖ రాజధాని అంటే బాబుకు మంట, అడ్డుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చద్వులు చెప్పిస్తామంటే కూడా ఆయన సహించలేరు, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నా కూడా బాబు ఓర్వలేరు అంటూ అవంతి విమర్శలు గుప్పించారు.

ఇక విశాఖ రుషికొండకు ఏమీ కాదని, అది బహు చక్కగా తమ ఏలుబడిలో ఉందని మాజీ మంత్రి భరోసా ఇస్తున్నారు. తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఎక్కడ జనంలో జగన్ కి పేరు వస్తుందో అని బాబు అడ్డుకుంటున్నారు అని సెటైర్లు వేశారు అవంతి.

రుషికొండ ఎందుకో టీడీపీకి సహా అన్ని రాజకీయ పక్షాలను ఇపుడు బాగా ఆకట్టుకుంటోంది. ఇపుడు అక్కడకు సాధారణ టూరిస్టులు తగ్గిపోయి పొలిటికల్ టూరిస్టులకు అది నెలవు అవుతోంది. రుషికొండని మింగేస్తున్నారు అని టీడీపీ మొదలెట్టిన ఈ ప్రచారం దానికి రివర్స్ అటాక్ చేస్తున్న వైసీపీ ఎక్కడ ఆగుతాయో తెలియదు కానీ రుషికొండ ఏపీలోనే హాట్ టాపిక్ అయిపోయిందిపుడు.