మెగా ఫ్యామిలా? ద‌గా ఫ్యామిలా?

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుపై వైసీపీ నాయ‌కుడు పోతిన మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మెగా ఫ్యామిలీనా? ద‌గా ఫ్యామిలీనా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నంద్యాల వైసీపీ అభ్య‌ర్థి శిల్పా…

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుపై వైసీపీ నాయ‌కుడు పోతిన మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మెగా ఫ్యామిలీనా? ద‌గా ఫ్యామిలీనా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నంద్యాల వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్రారెడ్డికి అల్లు అర్జున్ రాజ‌కీయంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై మెగా ఫ్యామిలీ ర‌గిలిపోతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

ఇలాంటి ప్ర‌చారానికి బ‌లం క‌లిగించేలా నాగ‌బాబు సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. అల్లు అర్జున్ త‌మ వాడు కాద‌నే అర్థం వ‌చ్చేలా నాగ‌బాబు త‌న మార్క్ స్పంద‌న తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య వార్ న‌డుస్తున్న నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కుడు పోతిన జోక్యం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా జ‌న‌సేన‌లో పోతిన మ‌హేశ్ కొన‌సాగారు. త‌న‌కు అన్యాయం చేశార‌ని ఆ పార్టీ నుంచి బ‌య‌టికొచ్చారు. అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు, నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా నాగ‌బాబుతో పాటు మెగా ఫ్యామిలీపై ఆయ‌న ఘాటుగా స్పందించ‌డం విశేషం. పోతిన మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టుల గురించి తెలుసుకుందాం. 

“స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా? మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు,  “నా పేరు సూర్య” సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్లు ఇప్పించి , మ‌రో రెండు సినిమాల్లో పాత్ర‌లు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న పుష్పా  2019లో జ‌న‌సేన పార్టీకి  రెండు కోట్ల రూపాయిల ఫండ్ ఇచ్చినా స్నేక్‌బాబు విషం చిమ్ముతున్నారు. 2009, 2019, 2024ల‌లో అండ‌గా నిలిచిన వారిపై, గీతా ఆర్ట్స్ కుటుంబ‌పైనే అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్న మెగా ఫ్యామిలీని ద‌గా ఫ్యామిలీ అనాలా?”

నాగ‌బాబును పాముతో పోల్చారు. నాగ‌బాబు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు పుష్పా అండ‌గా నిలిచార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ విషం చిమ్ముతూనే ఉన్నాడ‌ని ఆయ‌న వాపోయారు. అందుకే ఆ ఫ్యామిలీని ద‌గా కుటుంబం అని పిల‌వాలా? అంటూ నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా ప‌వ‌న్‌, నాగ‌బాబుపై పోతిన చెల‌రేగిపోతున్నారు.