నీ బిల్డప్ ఏందయ్యా నాని!

పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడుని పొగిడిన నోటితోనే వేరే పార్టీలోకి వెళ్లిన తర్వాత లేక వేరే పార్టీ వెళ్లాలని ఉద్దేశం ఉన్న వారు ఆ పార్టీ అధినాయకుడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఇప్పటికే వైసీపీ…

పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడుని పొగిడిన నోటితోనే వేరే పార్టీలోకి వెళ్లిన తర్వాత లేక వేరే పార్టీ వెళ్లాలని ఉద్దేశం ఉన్న వారు ఆ పార్టీ అధినాయకుడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఇప్పటికే వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు విషయంలో చూశాం. రఘురామ అంత కాకుండా మీడియా గొట్టం కనబడితే చాలు సొంత పార్టీపై గత కొంతకాలంగా విమర్శిస్తు.. తానే పెద్ద నీతివంతుడ్ని, స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన గెలిచే స‌త్తా ఉంద‌ని చెప్పుకుంటున్నా కేశినేని నానిపై గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) విమ‌ర్శ‌లు కురిపించారు.

'నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!!' అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు కురిపించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా ఎంపీ కేశినేని నాని మాత్రం గ‌త కొంత కాలంగా సొంత పార్టీ నేత‌ల‌తో కంటే ప్ర‌త్య‌ర్ధి పార్టీ నేత‌ల‌తో క‌లుస్తున్నారు. ఎక్క‌డ మీడియా క‌న‌ప‌డిన సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. నిన్న ఓ స‌మావేశంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ.. ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు తనను మరోసారి కోరుకుంటే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కాగా గత ఎన్నికల్లో కేశినేని నానిపై పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ గ‌త కొంత‌ కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు.. కానీ, కేశినేని నాని వైసీపీకి దగ్గరవుతున్నారు అని జరుగుతున్న చర్చ దృష్ట నానిపై ఆయ‌న‌ విమర్శలు కురిపించడం విశేషం.