నన్ను హత్యచేయడానికి నా కుటుంబాన్ని హత్య చేయడానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి తన ఇంటివద్ద రెక్కీ చేస్తున్నారంటూ పోలీసు కంప్లయింటు ఇచ్చి అదో రకం మైలేజీ సాధించాలనుకున్న ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. పూర్తిగా ఇరుక్కున్నారు. ఆయన ఎత్తుగడ బ్యాక్ ఫైర్ అయింది. లేనివన్నీ కల్పించి.. నాలుగు వీడియోలు షేర్ చేసుకోవడానికి పరిమితం కాకుండా, సీఐడీ కానిస్టేబుల్ ను చితక్కొట్టడంతోపాటు, తన హత్యకు అతను ప్రయత్నించినట్లుగా కంప్లయింటు ఇచ్చిన రఘురాజు.. ఇప్పుడు ఫేక్ మాటల వలన, ఊబిలో పూర్తిగా ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోంది.
ఏపీ సీఐడీ కానిస్టేబుల్.. రఘురామ ఇంటిలోకి చొరబడుతూ ఉండగా పట్టుకోలేదని, అతణ్ని ఐఎస్‌బి ప్రాంతంలోంచి, రఘురామ సెక్యూరిటీ జవాన్లు బలవంతంగా ఎత్తుకుపోయారని బయటకు వచ్చింది. ఈ వివాదం.. వీడియోలు కూడా బయటకు రావడంతో.. ఆయన సెక్యూరిటీకి నియమించిన జవాన్లను కూడా సస్పెండ్ చేశారు.
ఓ వ్యక్తిని జవాన్లు చితక్కొట్టి బలవంతంగా ఎత్తుకుని.. కారులోపెట్టుకుని తీసుకువెళుతున్నట్లుగా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అవేమీ కల్పిత వీడియోలు అనడానికి కూడా వీల్లేదు. ఫుటేజీ అంత క్లీన్ గా ఉంది. వారా పని చేస్తుండగా.. రోడ్డు మీద వెళుతున్న సాధారణ వ్యక్తులు తీసిన వీడియోలాగా కనిపిస్తోంది. AP 24 AU 7777 నెంబరు గల కారులో తరలించినట్లుగా స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది.
అలా కానిస్టేబుల్ ను ఎత్తుకెళ్లిన వారు.. రఘురామ ఇంటికి తీసుకువెళ్లి అక్కడ బాగా కొట్టినట్లు తెలుస్తోంది. ఇంటివద్ద కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ఇదివరకే బయటకు వచ్చాయి. తన మీద హత్యాప్రయత్నంగా రఘురాజు చెప్పుకుంటున్నారు గానీ.. ఇప్పుడు అంతా తేటతెల్లం అయిపోయింది. అలా సీఐడీ పోలీసు సుభానీని పట్టుకుని.. దారుణంగా కొట్టి బలవంతంగా తీసుకెళ్లినందుకు ఎంపీ భద్రతాసిబ్బందిని నోయిడా సీఆర్పీఎఫ్ కమాండెంట్ సస్పెండ్ కూడా చేశారు.
సుభానీ ఆల్రెడీ.. రఘురామ, ఆయన కొడుకు, ఆయన భద్రతసిబ్బందిపై ఓ ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ తర్వాత.. తనను తాను సమర్థించుకుంటూ రఘురామ చెప్పిన మాటలన్నీ కల్ల మాటలే , అబద్ధాలే అని తేలిపోయింది. ఇప్పుడు ఆయన మరియు ఆయన కొడుకు కూడా ఇరుక్కున్నట్లే. వారి మీద కేసులు నమోదు అయి ఉన్నాయి. అంత ఈజీగా తప్పించుకోలేరు కూడా.
అయినా.. రఘురామ చెప్పిన ఫేక్ మాటలు విని.. పతాకశీర్షికల్లో ఆయన మీద హత్యాయత్నం జరిగిందన్నంతగా ప్రచారం చేసిన పచ్చ మీడియా.. తాము రఘురాజు చేతిలో ఫూల్స్ అయిపోయినందుకు మొహం ఎక్కడ పెట్టుకుంటుందో?