రాహుల్ గాంధీ విశాఖ టూర్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ నెలలో ఆయన విశాఖ రానున్నరని పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటూ ఈ రోజు విశాఖలో జరిగిన ఉక్కు పరిరక్షణ సమితి ఆద్వర్యంలోని మార్చ్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ కాకుండా కాపాడే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది అని గిడుగు రుద్రరాజు అంటున్నారు. రాహుల్ గాంధీ ఆగస్టులో విశాఖలో జరిగే ఉక్కు పోరాటంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కచ్చితంగా వస్తుందని విశాఖ ఉక్కుని కాంగ్రెస్ మాత్రమే కాపాడుతుందని ఈ విషయం అందరికీ తెలుసు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాంగ్రెస్ మాత్రమే చూస్తుందని ఆయన అంటున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అలా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు.
విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలోని బీజేపీ చాలా ముందుకు వచ్చేసింది అని అంటున్నారు. ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం ఒక్కటే తరువాయి అన్నట్లుగా బీజేపీ దూకుడు ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే కాపాడుతామని గిడుగు అంటున్నారు. అప్పటివరకూ బీజేపీ ఆగుతుందా అన్నది ఆలోచించాలని అంటున్నారు.
ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో పోరాటాలు ఉక్కుని కాపాడగలవా అన్నదే సందేహంగా ఉంది. బీజేపీ ఎన్నికల ఏడాదిలో ఎంతో కొంత ప్రైవేటీకరణ అంశాన్ని జాప్యం చేస్తే మాత్రం విశాఖ ఉక్కుకి లక్ తగిలినట్లే అంటున్నారు.