ఆయన ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యరు. లక్ కొద్దీ ఆ పార్టీకి శాసనసభా పక్ష నాయకుడిగా కూడా అయ్యారు. దాంతో ఫ్లోర్ లీడర్ గా సభలో అప్పట్లో బాగా ఫొకస్ అయ్యారు. అందరి కీలక నేతలతో పరిచయాలు కూడా బాగా ఉన్నాయి. ఆయనే బీజేపీ రాజా వారు. అసలు పేరు విష్ణు కుమార్ రాజు.
ఆయన తరచూ మీడియా మీటింగ్స్ పెట్టి జగన్ సర్కార్ ని ఉతికి ఆరేస్తే కానీ నిద్రపోరు. ఆయన ఏ టూ జెడ్ అన్నట్లుగా చాలా విషయాలు మాట్లాడతారు. వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తారు. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసి పొత్తులు లేకుండా సొంతంగా గెలిచే పరిస్థితి ఉందా అంటే నో అనే చెప్పాలి.
అందుకేనేమో ఆయన మీడియాలోనే ఫోకస్ అయ్యే ప్రయత్నమే చేస్తున్నారు. ఏదో రకంగా ఈసారి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. జగన్ మీద ఘాటు విమర్శలు చేస్తే హైలెట్ కావచ్చు అన్న ఆలోచనతో ఆయన ఎంత చేస్తున్నా టీడీపీ అనుకూల మీడియాలో ఓ మాదిరి కవరేజ్ వస్తోంది తప్ప మరేమీ లేదు.
ఇక ఆయన చేస్తున్న హాట్ హాట్ కామెంట్స్ కి వైసీపీ నేతల నుంచి ప్రతి విమర్శలు వస్తే కొన్నాళ్ల పాటు అయినా మీడియాలో నలిగే సీన్ ఉండేది. కానీ ఆయన ఏం మాట్లాడినా అసలు పట్టించుకోవడంలేదు అధికార పార్టీ. దాంతో పాపం రాజు గారి బాణాలు అన్నీ వేస్ట్ అయిపోతున్నారు.
బీజేపీలో స్టేట్ లెవెల్ లీడర్ గా ఉన్న రాజు గారి కంఠశోషకు రాజకీయ లాభం ఇప్పటికైతే లేదు అనే అంటున్నారు. మరి టీడీపీ గొంతునే తన టోన్ గా మార్చుకున్నా ఆ వైపు నుంచైనా సాఫ్ట్ కార్నర్ ఉందా అంటే అదీ తెలియడంలేదుట. మొత్తానికి రాజు గారి ఆరాటమే తప్పా ఒరిగేది ఏమిటో అని అంటున్నారు అంతా.