Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ బాబు..యాడ్ … దివాళా

మహేష్ బాబు..యాడ్ … దివాళా

హీరోలు ఏ ప్రకటనలు చేసినా ఫరవాలేదు కానీ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లు ఎండార్స్ చేసేటపుడు కాస్త జాగ్రత్తగా వుండాలి. 

ఎందుకంటే ఏ సంస్థ ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియదు. ఎప్పుడు బోర్డు తిప్పేస్తుందో తెలియదు. కోట్లు ఇస్తున్నారు కదా అని ఈ ప్లాటు కొనండి, ఆ ఇల్లు కొనండి అంటూ రికమెంట్ చేస్తే, తీరా చేస్తే ఆ కంపెనీలు దివాళా తీసేస్తే ఏమిటి పరిస్థితి?

సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు బాగా అంటే బాగా సన్నిహితుడైన ఒక దర్శకుడిని నమ్మి, చాలా అంటే చాలా భారీ మొత్తానికి. ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును అండార్స్ చేసారని తెలుస్తోంది. ఆ మేరకు హోర్డింగ్ లు, వీడియోలు ఎంత హడావుడి చేయాలో అంతా చేసారు. కానీ తీరా చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టిన వాళ్లంతా లబో దిబో అంటున్నారని బోగట్టా.

సగం వరకు వచ్చి ఆ ప్రాజెక్టును ఆపేసారట. దాంతో డబ్బులు కట్టిన వాళ్లు, బుక్కింగ్ అమౌంట్ లు కట్టిన వారు అవి వెనక్కు రాక కిందా మీదా అవుతున్నారని బోగట్టా. 

సాధారణంగా హీరోలు, తెలుసున్నవాళ్లు చెప్పాలని పెట్టుబడులు ధైర్యంగా పెడతారు ఎవరైనా. కానీ హీరోలు రెమ్యూనరేషన్ కోసం యాడ్ లు చేస్తే కూడా నమ్మితే ఇదిగో ఇలా వుంటుందేమో?

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా