చింత చచ్చినా పులుపు చావని రాయపాటి అహంకారం!

ఆయన ఇప్పుడు పండు ముదుసలి. ఇంచుమించు ఎనభయ్యేళ్లు! కూర్చోలేడు నడవనూలేడు. వీల్ ఛెయిర్ లో వెళ్లాల్సిందే. ఆయన రాజకీయ జీవితం ఎన్నడో ముగిసిపోయింది. వ్యాపార జీవితం అనేక లోపాల వ్యవహారాలతో సాగుతో పోతోంది. ఇంత…

ఆయన ఇప్పుడు పండు ముదుసలి. ఇంచుమించు ఎనభయ్యేళ్లు! కూర్చోలేడు నడవనూలేడు. వీల్ ఛెయిర్ లో వెళ్లాల్సిందే. ఆయన రాజకీయ జీవితం ఎన్నడో ముగిసిపోయింది. వ్యాపార జీవితం అనేక లోపాల వ్యవహారాలతో సాగుతో పోతోంది. ఇంత జరిగినా ఆయనలోని అహంకారం మాత్రం చావలేదు. న్యాయమూర్తి ఎదుట రాజీకి ఒప్పుకుని.. కోర్టులోంచి బయటకు వచ్చి ఇది రాజీకాదు.. ఆయనే కేసు వెనక్కు తీసుకున్నాడు అంటూ మాట్లాడడం, అడ్డగోలు మాటలకు, బుద్ధికి, అహంకారానికి నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇదంతా గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి. 

బద్ధశత్రువులైన కన్నాలక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావుల మధ్య వైరం అందరికీ తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ గురించి ఎన్నడో పన్నెండేళ్ల కిందట రాయపాటి సాంబశివరావు కొన్ని ఆరోపణలు చేశారు. వాటిమీద కన్నా లక్ష్మీనారాయణ కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. వీరిద్దరి మధ్య ఈ దావా పన్నెండేళ్లుగా కోర్టులో నడుస్తోంది. 

గుంటూరు జిల్లా సెషన్స్ జడ్జి ఇద్దరినీ హాజరుకావాలని ఆదేశించడంతో ఈ ఇద్దరు నాయకులు కోర్టుకు వచ్చారు. రాయపాటి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు, అందువలన కన్నా తన పరువునష్టం దావాను వెనక్కు తీసుకున్నట్టు టెక్నికల్ గా దీన్ని ముగించారు. న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరూ ఆ మేరకు రాజీకి వచ్చినట్లుగా ప్రకటించారు. 

కోర్టునుంచి వెలుపలికి వచ్చిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంగా ఇదే విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. ఆయన ఆరోపణల్ని విత్ డ్రా చేసుకున్న మీదట.. నేను కూడా దావా విత్ డ్రా చేసుకున్నానని కన్నా చెప్పారు. కానీ, వీల్ చెయిర్ లో వచ్చిన రాయపాటి సాంబశివరావు మాత్రం భిన్నంగా మాట్లాడారు. ‘

‘కన్నాగారు కేసు విత్ డ్రా చేసుకున్నారు. ఇది రాజీకాదు. నన్ను అడిగారు. (ఆయన విత్ డ్రా చేసుకోడానికి) నాకు అభ్యంతరం లేదన్నాను.’’ అంటూ సెలవిచ్చారు. ‘‘ఆరోపణలు ఆయన మీద నేను చేయనేలేదు. అవన్నీ ప్రూవ్ కావు..’’ అంటూ వాదప్రతివాదాలు జరుగుతున్నప్పుడు.. కోర్టులో ఎలా సమర్థించుకుంటారో.. అదే తరహాలో చెప్పుకొచ్చారు. ఇద్దరూ వార్ధక్యంలోకి ప్రవేశించిన చాలా చాలా సీనియర్ నాయకులు. 

కన్నాకైనా ఇంకా కొంత కెరీర్ ఉన్నది గానీ.. రాయపాటి సాంబశివరావు రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్టే. అయినా సరే.. ఇంత అహంకారంతో.. తాను మెట్టు దిగినట్టే ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడే వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారు.