దర్శకుడు రాంగోపాల్‌వర్మలో కామెడీ పండించే కళాకారుడున్నాడని ఇప్పుడే బయటపడింది. దెయ్యాలు, ఫైటింగ్‌లు… ఇలా సీరియస్ అంశాలపై సినిమాలు తీయడం మాత్రమే చూశాం. ఆర్జీవీ సినిమాలంటే మనసులో ఒక అభిప్రాయం ముద్ర పడింది. అలాంటి అభిప్రాయాల్ని తుడిచేసేలా జీవీ రావు అనే ఆర్థిక నిపుణుడిపై కామెడీ పండించారు. ఆ వీడియో చూస్తే, నవ్వకుండా ఉండలేని పరిస్థితిని ఆర్జీవీ సృష్టించారు.
ఇటీవల ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణుడు జీవీ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్ కూడా జీవీరావుపై సంచలన కామెంట్స్ చేశారు. ఇదిలా వుండగా జీవీరావుపై ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్? అనే క్యాప్షన్‌తో ఆర్జీవీ తన ట్విటర్ ఖాతాలో 1.51 నిమిషాల వీడియోని షేర్ చేశారు.
దయచేసి మీకు ఇష్టమైన ఆర్థిక నిపుణుడు జీవీ రావు ప్రతిభను ఆస్వాదించాలని చంద్రబాబును ఉద్దేశించి ఆర్జీవీ పోస్టు పెట్టడం విశేషం. ఇందులో సినిమా పాటలు, అన్నా మన కులపోడే అంటూ చంద్రబాబుకు చెప్పే డైలాగ్, అలాగే జీవీ రావు అదరగొట్టే డ్యాన్స్, ఇదే సందర్భంలో ఈ చిత్ర వధన భరించలేనంటూ సీనియర్ హీరోయిన్ ఏడుస్తూ అనడం… ఇలా అనేక కోణాలు ఈ వీడియోలో చోటు చేసుకున్నాయి.
ప్రతిదీ హాయిగా నవ్వుకునేలా క్రియేట్ చేయడం విశేషం. జీవీరావుకు సంబంధించిన చిత్రివిచిత్ర ఫొటోలు ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీడీపీ కేడర్‌కు చురకలు అంటించేలా ఉండగా, వైసీపీ శ్రేణులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాయి.