ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌కు టీడీపీ, జనసేన నేతలు విలవిలలాడుతున్నారు. వర్తమాన రాజకీయాలపై వర్మ ఎప్పటికప్పుడు తన స్పందనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీపై వర్మ దిమ్మ తిరిగే ట్వీట్ చేశారు.
“కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అని వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్మ కామెంట్స్ ముఖ్యంగా జనసేనకు చిర్రెత్తుకొచ్చేలా వున్నాయి. కర్రు కాల్చి వాత పెట్టడం అంటే ఏంటో వర్మ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. ఆర్జీవీ ట్వీట్ కాదది వెరీ హాట్ అని… టీడీపీ నేతల ఆగ్రహం చెబుతోంది. వర్మ లాంటి వాళ్ల ట్వీట్స్ తమ మధ్య కుదరనున్న పొత్తును చెడగొడుతుందనే భయం టీడీపీని వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో జనసేనకు మద్దతుగా వర్మపై టీడీపీ విమర్శలకు దిగింది. వర్మపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామ్‌గోపాల్ వర్మ ఒక కామ మృగం, దరిద్రుడని తీవ్రస్థాయిలో దూషించారు. కులాల గురించి దర్శకుడు మాట్టాడ్డం ఏంటని ఆయన నిలదీశారు.
కమ్మ, కాపు కలిస్తే.. ఆర్జీవీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అని బండారు ప్రశ్నించడం గమనార్హం. ఆర్జీవీని ఆయన భార్య, కూతురు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆర్జీవీని కుటుంబ సభ్యులే పట్టించుకోరనే అభిప్రాయం వున్నప్పుడు, ఆయన ట్వీట్‌పై స్పందించాల్సిన అవసరం ఏంటో బండారు చెప్పాలి. ఆర్జీవీ ట్వీట్ బాగా ఇరుకున పెట్టిందని బండారు ఆగ్రహమే చెబుతోందని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.