జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబును మంత్రి ఆర్కే రోజా ట్విటర్ వేదికగా కుమ్మేశారు. రోజా అని ఎలాంటి ముందూ, వెనుకా ఎలాంటి గౌరవం లేకుండా నాగబాబు మాట్లాడ్డంపై రోజా ఫైర్ అయ్యారు. అలాగే పదేపదే నువ్వు…నువ్వు అని సంబోధించడంపై కూడా ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నాగబాబు తనపై చేసిన కామెంట్స్‌కు ట్విటర్ వేదికగా ఆమె గట్టి సమాధానం ఇచ్చారు.
అలాగే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావని, మున్సిపాలిటీ కుప్పతొట్టితో రోజాను పోల్చిన నేపథ్యంలో పాత వీడియోలను రోజా తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు రోజా ఏమని కౌంటర్ ఇచ్చారో తెలుసుకుందాం. ఏది నిజం? ఎందుకు ఆ కలయిక? ఆ పగలు, ప్రతీకారాలు అంతా డ్రామానా? అని నిలదీస్తూ రోజా కౌంటర్ వీడియో విడుదల చేశారు.
“విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం!!”
2021వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఉన్నట్టు రోజు కౌంటర్ ఇచ్చారు. అలాగే మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదే నాగబాబు చెప్పిందాంట్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే నాగబాబును ఉద్దేశించి ఏపీ గురించి మీ జ్ఞానం శూన్యం అని దెప్పిపొడవడం.
ఇదీ నాగబాబుకు రాతల ద్వారా రోజా ఇచ్చిన కౌంటర్. అలాగే బాలకృష్ణ గతంలో పవన్‌కల్యాణ్ సభలకు వెళ్లే వాళ్లని ఉద్దేశించి ఏమన్నారు, దానికి పవన్ రియాక్షన్ ఏంటి? తదితర వీడియోలను తెరపైకి తీసుకొచ్చి నాగబాబును ఓ రేంజ్‌లో చాకిరేవు పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలకృష్ణ గారి మాటలు చూడండి….పవన్‌కల్యాణ్ సభలకు సంకర జాతి నాకొడుకులు, అలగా జనం అంటున్నారని జనసేనాని అన్న మాటలను ఆమె గుర్తు చేశారు. దీన్ని ప్రజలు గుర్తించారని , బాధపడుతున్నారని పవన్ అనడాన్ని రోజా ఆ వీడియోల ప్రదర్శన ద్వారా ప్రశ్నించారు. ఏమనుకుంటు న్నారు మీరు…ప్రత్యేకంగా పెట్టి పుట్టారనుకుంటున్నారా? అని పవన్ ఆవేశంగా ప్రశ్నించడాన్ని మరోసారి గుర్తు చేయడం రోజా ట్వీట్‌లో ప్రత్యేకత. నాగబాబుకు దిమ్మతిరిగేలా రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.