రాష్ట్రపతి విడిదిగా రుషికొండ ప్యాలెస్ ?

విశాఖలో అయిదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునికమైన రుషికొండ భవనాలను రాష్ట్రపతి విడిదిగా మార్చాలని బీజేపీ నేత రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ వంటి సుందర నగరానికి రాష్ట్రపతి విడిది చేసి ఆ…

విశాఖలో అయిదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునికమైన రుషికొండ భవనాలను రాష్ట్రపతి విడిదిగా మార్చాలని బీజేపీ నేత రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ వంటి సుందర నగరానికి రాష్ట్రపతి విడిది చేసి ఆ భవనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు.

తొందరలోనే ఆ భవనాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. రుషికొండ భవనాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారని అందువల్ల దానిని విశిష్టమైన హోదాలో ఉన్న దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతికే అంకితం చేయాలని ఆన సూచిస్తున్నారు.

శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఆనవాయితీ అని ఆయన గుర్తు చేశారు. అలాగే ఏపీకి కూడా రాష్ట్రపతి వచ్చేలా చూడాలని అన్నారు. రుషికొండ మీద ఒక వైపు ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర కెరటాలు మరో వైపున ప్రకృతి సహజ సౌదర్యం ఎత్తైన కొండలు అన్నీ కలసి అద్భుతమైన వాతావరణాన్ని కలుగచేస్తాయని ఆయన అంటున్నారు. రుషికొండ భవనాలను ఏ విధంగా వాడాలో తెలుగుదేశం నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇంత ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలను రాష్ట్రపతి విడితి పేరుతో ఏడాది పొద్దు అంతా మూసి ఉంచడం సమజసమేనా అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న సందేహం. తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రం విశాఖలో ఒక మంచి భవనాన్ని వైసీపీ నిర్మించి ఇచ్చింది. దానిని వినియోగించాలనుకుని ఆ కోరిక తీర్చుకోలేక దిగిపోయింది. అదే ఇపుడు టీడీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది అని అంటున్నారు.