టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. పెదవేగి పోలీస్‌స్టేషన్ నుంచి హత్యాయత్నం కేసులో నిందితుడైన టీడీపీ కార్యకర్త రాజశేఖర్‌ను బలవంతంగా చింతమనేని తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సీఐ కొండవీటి శ్రీనివాస్‌తో పాటు పోలీసులు అడ్డుకున్నా, వారితో వాగ్వాదానికి దిగి, అనుచరులతో కలిసి తన అనుచరుడిని తరలించుకెళ్లారు.
ఈ ఘటనపై చింతమనేనితో పాటు 14 మందిపై కేసు నమోదైంది. ఈ నెల 16 నుంచి చింతమనేని పరారీలో ఉన్నాడు. దెందులూరు నుంచి చింతమనేని టీడీపీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అతనిపై 94 కేసులు నమోదయ్యాయి. చింతమనేని రౌడీయిజానికి హద్దు లేకుండా పోయింది. తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా అతను దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో చింతమనేని కోసం ఆరు బృందాలు వెతుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిచి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. చింతమనేని ఆట కట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా తమ కస్టడీ నుంచే నిందితుడిని బలవంతంగా లాక్కెళ్లడాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది.
ఇలాగైతే భవిష్యత్‌లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాడని పోలీసులు మండిపడుతున్నారు. నేరాలకు పాల్పడడం, ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగడం చింతమనేనికి అలవాటే అంటున్నారు.