పార్టీలకు అతీతంగా తన కుమారుడు వివాహానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తోంది ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని కోరుతూ పవన్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
గత వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
కాగా షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం ఈ నెల 18న, వివాహం వచ్చే నెల 17న జరగనున్నాయి. ఈ వేడుకలకు రావాలని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను రాజకీయాలకు అతీతంగా ఆమె ఆహ్వానిస్తున్నారు.
మొదట తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికెళ్లి నిశ్చితార్థ, వివాహ వేడుకలకు రావాలని ఆహ్వానించారు.