ఆమె రాజకీయానికి ఈ కౌంటర్ అవసరమా?

పచ్చ మీడియా ఎప్పుడూ చిత్ర విచిత్రమైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటివారికి అన్నాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచన మాత్రం ఎందుకు రాకుండా ఉంటుంది? ఇప్పుడు అదే పని జరుగుతోంది.  Advertisement హెల్త్…

పచ్చ మీడియా ఎప్పుడూ చిత్ర విచిత్రమైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటివారికి అన్నాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచన మాత్రం ఎందుకు రాకుండా ఉంటుంది? ఇప్పుడు అదే పని జరుగుతోంది. 

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని వివాదంగా మార్చేందుకు పచ్చ దళాలు  మొత్తం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే! అందులో భాగంగానే జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలను కూడా వాళ్లు ప్రచారంలోకి తెచ్చారు!. 

ఈ పేరు మార్పును ఆమె ఖండించారు. ఇలా పేరు మార్చడం అనేది ఆ మహా నాయకుడిని అవమానించడమే అవుతుంది అని.. ఆయనను అభిమానించే కోట్లాదిమంది మనోభావాలను గాయపరచడం అవుతుందని.. షర్మిల సెలవిచ్చారు. భవిష్యత్తులో ఏపీలో మరొక పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ పేరుని తొలగిస్తే అది ఆయనకు అవమానం కదా.. అని కూడా ఆమె వాపోయారు! 

వైయస్ రాజశేఖర్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని కూడా అభిమానించే కోట్లాదిమందిలో ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తెలంగాణలో రాజకీయాలు చేయడానికి కష్టపడుతున్న ఆమె.. ఏపీ పరిణామాల మీద కామెంట్లు చేయడం అవసరమా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. షర్మిల అనవసరంగా ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇదంతా కూడా పచ్చ మీడియా వక్ర వ్యూహంలో భాగమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసిన టీవీ ఛానల్ ప్రతినిధులు ఆమెను ఏపీ వ్యవహారాల గురించి మాట్లాడమని అడగడమే ఒక కుట్ర. ఒక వ్యూహం! ఆ ట్రాప్ లో షర్మిల చాలా సులువుగా చిక్కుకున్నారు. “తెలంగాణ రాజకీయాల సంగతి అడగండి” అని ఎదురు ప్రశ్నించడం ద్వారా వారి నోరు మూయించగల సులువైన అవకాశాన్ని షర్మిల జారవిడుచుకున్నారు. 

అన్నయ్య నిర్ణయాన్ని తప్పుపడుతూ సుదీర్ఘమైన వ్యాఖ్యలు చేశారు. “మా నాన్నను నేను ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేదు.. ఆయనని నేను ఆరాధించినట్లు మరెవ్వరూ ఆరాధించలేరు” ఇలాంటి వ్యాఖ్యలు అనవసరమైన వివాదానికి, అనుమానాలకు ఆస్కారం ఇచ్చేవి! రాజకీయంగా ఉత్సాహం ఉన్నప్పటికీ.. మీడియా పన్నే ఉచ్చులో చిక్కుకోకుండా మనగల పరిణతి షర్మిలకు ఇంకా రాలేదని ఈ వ్యవహారంతో తేలిపోయింది. 

ఎన్టీఆర్ కు అనుకూలంగా మాట్లాడడం వలన తెలంగాణలో సీమాంధ్ర వాళ్ళ, కమ్మ వాళ్ళ ఓట్లు తనకు వస్తాయని ఆమె ఊహించి ఉండవచ్చు. కానీ  వైయస్సార్ కూతురుగా కంటే ఆమె అతిగా సాధించబోయే ఏమీ లేదు అనే క్లారిటీ తెచ్చుకుంటే మంచిది.