ఆ ఇద్దరూ వెళితే.. అంతం కాబోదు షర్మిలమ్మా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి.. ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం, జనసేన కంటె ఎక్కువగా తీవ్రమైన విమర్శలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి షర్మిల విరుచుకుపడుతూ ఉంటుందనే సంగతి అందరికీ…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి.. ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం, జనసేన కంటె ఎక్కువగా తీవ్రమైన విమర్శలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి షర్మిల విరుచుకుపడుతూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు.

తాజాగా తెలుగుదేశం.. నిజమో కాదో తెలియని రీతిలో తిరుమలేశుని లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యత గురించి సందేహాలు లేవనెత్తింది. తెలుగుదేశానికి అనుబంధ పార్టీ స్థాయిలో షర్మిల కూడా ఆ వ్యవహారాన్ని, నిజానిజాలు నిర్ధరించుకోకుండానే నెత్తికెత్తుకుంది. అయితే ఈ సందర్భంగా పార్టీ పరిస్థితి గురించి ఆమె చెప్పిన మాటలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

వైసీపీ విశ్వసనీయతను కోల్పోయిందని, వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారని. ప్రజలను మోసం చేశారని, వైకాపా అంతం అయినట్టేనని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పార్టీలో జగన్ తప్ప మరెవ్వరూ మిగలరు అని షర్మిల జోస్యం చెప్పారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా ఆ పార్టీలో ఉండబోరు.. అని షర్మిల చెప్పడం గమనార్హం.

సరిగ్గా ఈ మాట దగ్గరే వైసీపీ వర్గాల నుంచి రకరకాల వ్యాఖ్యానాలు వినివస్తున్నాయి. సజ్జల, విజయసాయి ఇద్దరూ బయటకు వెళ్లిపోతే.. వైసీపీ అంతం ఎలా సాధ్యమవుతుంది? ఆ పార్టీ పునరుత్థానం చెంది వైభవ స్థితికి చేరుకుంటుంది కదా అంటున్నారు. ఆ ఇద్దరూ వీలైనంత తొందరగా బయటకు వెళ్లిపోతే.. అయిదేళ్ల తర్వాత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ దెబ్బతినడానికి.. జగన్ మోహన్ రెడ్డిని మబ్బులో ఉంచుతూ సజ్జల, విజయసాయి నడిపిస్తున్న రాజకీయాలే ఒక కీలక కారణం అనే విమర్శలు పార్టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా పార్టీనుంచి వెళ్లిపోయిన ప్రతి నాయకుడు కూడా సజ్జల వైఖరి మీద, ఈ ఇద్దరి తీరుమీద అనేక విమర్శలు చేసే వెళ్లారు. తాము వారి తీరు గురించి చెప్పినా జగన్ పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో వెళ్లారు. అలాంటిది.. ఆ ఇద్దరు నాయకులు బయటకు వెళితే గనుక.. వైసీపీకి మంచిరోజులు వచ్చినట్టే షర్మిలక్కా అని కార్యకర్తలు అనుకుంటున్నారు.

ఇదంతా ఓకే గానీ.. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిల, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వానికి అప్రకటిత అధికార ప్రతినిధి ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉన్నదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు కూడా!

4 Replies to “ఆ ఇద్దరూ వెళితే.. అంతం కాబోదు షర్మిలమ్మా!”

  1. తమ్మినేని సీతారాం, మల్లాది విష్ణు, రంగనాధ రాజు , ఇంకా రాయలసీమ కి చెందిన ముగ్గురు, నలుగురు రెడ్డి సామాజిక నాయకులూ కూడా జనసేన తలుపు తట్టారంట .

  2. ఒరేయ్ ఎనకటా చెడ్డీ!! నువ్వు చెప్పే ఆ “పలువురు” ఎప్పుడూ నీ కొంపలోనే ఉంటారా ఏంటి !! నికొక్కడికే వాళ్ళ మాటలు వినపడుతుంటాయి, అదేంటో కాని.

Comments are closed.