ఊహూ.. జేసీకి ద‌క్క‌ని బూడిద‌!

సీఎం చంద్ర‌బాబునాయుడు దృష్టికి ఆర్టీపీపీ బూడ‌ద పంచాయితీ పోవ‌డంతో, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స‌మాచారం. త‌డి బూడ‌ద ద‌గ్గ‌ర స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పిన సంగ‌తి…

సీఎం చంద్ర‌బాబునాయుడు దృష్టికి ఆర్టీపీపీ బూడ‌ద పంచాయితీ పోవ‌డంతో, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స‌మాచారం. త‌డి బూడ‌ద ద‌గ్గ‌ర స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే. స్థానికుల అవ‌స‌రాల‌కు కూడా లేకుండా, అంతా తానే తీసుకుంటాన‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్ప‌డం వ‌ల్లే స‌మ‌స్య త‌లెత్తిన‌ట్టు ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఇరువురితో మాట్లాడారు. ఇద్ద‌రు నేత‌లు కూచొని మాట్లాడుకుని, ఒక అవ‌గాహ‌న‌కు రావాల‌ని సూచించారు. అయితే అవ‌గాహ‌న కుదిరిన‌ట్టు లేదు. దీంతో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ట్యాంక‌ర్ల‌కు త‌డి బూడిద‌ను లోడ్ చేయ‌లేద‌ని తెలిసింది. అంటే స‌మ‌స్య ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా వుంది.

ఇద్ద‌రు నేత‌లు ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతోనే స‌మ‌స్య జ‌ఠిల‌మైంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇద్ద‌రు కాస్త ప‌ట్టువిడుపుల‌తో వెళ్లి వుంటే, ఇంత వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌ని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు స‌మ‌స్య పెద్ద‌ది కావ‌డంతో ప‌రిష్కారానికి ఇగో అడ్డంకిగా మారింది.

ఒక్క జేసీ వాహ‌నాల‌కు త‌ప్పిస్తే, మిగిలిన వ్య‌వ‌హారాల‌న్నీ ఆర్టీపీపీలో మామూలుగానే జ‌రిగిపోతున్నాయ‌ని తెలిసింది. జేసీ, ఆదినారాయ‌ణ‌రెడ్డిని ఒకచోట కూచోపెట్టి పంచాయితీ చేసే వాళ్లు లేరు. అందుకే స‌మ‌స్య తెగ‌డం లేద‌ని అంటున్నారు. అయితే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఊరికే వుంటారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

3 Replies to “ఊహూ.. జేసీకి ద‌క్క‌ని బూడిద‌!”

Comments are closed.