కిరణ్ అబ్బవరం.. కె.ర్యాంప్

తిట్లు, నెగెటివ్ పదాలే కదా ఇప్పుడు సినిమా టైటిళ్లు అంటే. పైగా టైటిల్ దగ్గర నుంచే బజ్ రావాలి. అంటే టైటిల్ చిత్ర విచిత్రంగా ఉండాలి. క అనే టైటిల్‌తో హిట్ కొట్టాడు హీరో…

తిట్లు, నెగెటివ్ పదాలే కదా ఇప్పుడు సినిమా టైటిళ్లు అంటే. పైగా టైటిల్ దగ్గర నుంచే బజ్ రావాలి. అంటే టైటిల్ చిత్ర విచిత్రంగా ఉండాలి. క అనే టైటిల్‌తో హిట్ కొట్టాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు మరోసారి కె. ర్యాంప్ అనే చిత్రమైన టైటిల్‌తో సినిమా చేయబోతున్నాడు. కె ఫర్ ఏమిటన్నది తరువాత చెబుతారు. కానీ సోషల్ మీడియాలో కె. ర్యాంప్ అనేదానికి వేరే అర్థం ఉంది. చాలా వైరల్ పదం కనుక వేగంగా జనాల్లోకి వెళ్తుంది.

ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తారు. కథ రెడీగా ఉంది. కొత్త దర్శకుడు పని చేస్తారు. ఓ వారం పది రోజుల్లో అన్నీ ఫైనల్ అయిన తరువాత సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుంది.. కె. ర్యాంప్ అంటూ.. నిజంగా కె. ర్యాంప్ నా కాదా అన్నది విడుదల తరువాత తెలుస్తుంది.

ఇదిలా ఉంటే క సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 12 కోట్లు షేర్ వసూలు చేసి పెద్ద హిట్‌గా నిలించింది. దీంతో కిరణ్ అబ్బవరం సినిమాకు ఓ మాదిరి ఓపెనింగ్, ఓ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ మేరకు జనాలకు నచ్చే సబ్జెక్ట్ ఉండాలి. అది కీలకం, అప్పుడు కె. ర్యాంప్.

4 Replies to “కిరణ్ అబ్బవరం.. కె.ర్యాంప్”

Comments are closed.