పవన్ ఇక నో షూటింగ్ ఇన్ హైదరాబాద్

పవర్ స్టార్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా మూడు ఉన్నాయి. ఒకటి వీరమల్లు, రెండు ఓజి, మూడు ఉస్తాద్. ఈ మూడూ పూర్తి చేయాలనే నిశ్చయంతోనే ఉన్నారు పవన్.…

పవర్ స్టార్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా మూడు ఉన్నాయి. ఒకటి వీరమల్లు, రెండు ఓజి, మూడు ఉస్తాద్. ఈ మూడూ పూర్తి చేయాలనే నిశ్చయంతోనే ఉన్నారు పవన్. కానీ రెండు కండిషన్లు:

సినిమాల షూటింగ్ మంగళగిరి చుట్టుపక్కలే ఉండాలి. సెట్ వేసుకుని అక్కడే చేయాలి. రోజుకు రెండు మూడు గంటలకు మించి కేటాయించడం కష్టం.

పవన్ కళ్యాణ్ మూడు శాఖల మంత్రిగా పని వత్తిడి తీవ్రంగా వుంది. ఇటు పార్టీ వ్యవహారాలు, అటు ప్రభుత్వ వ్యవహారాలు రెండూ చూసుకోవాలి. అందువల్ల సినిమాలకు సమయం కేటాయించడం చాలా కష్టం. పైగా హైదరాబాద్ వచ్చి షూట్ చేయాలంటే ఆయన ప్రభుత్వ పనులు పక్కన పెట్టేసి వచ్చేయాలి. అదే షూట్ కనుక మంగళగిరి చుట్టుపక్కల వుంటే డైలీ రొటీన్ లో అడ్జస్ట్ చేయచ్చు.

వీలయినంత వరకు హీరోలేని సీన్లు, హీరో ఫ్రేమ్ లోకి రాని సీన్లు అన్నీ తీసేసుకుని, జస్ట్ హీరోకి సంబంధించి క్లోజప్ సీన్లు మాత్రం పెండింగ్ వుంచుకుని ప్రిపేర్ అయితే చకచకా ఫినిష్ చేయాలన్నది పవన్ ఐడియాగా తెలుస్తోంది. ఈ లెక్కన వీరమల్లు, ఓజి సినిమాలు పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఉస్తాద్ కు 60 నుంచి 80 రోజులు డేట్ లు కావాలి దాని మరి ఏం చేస్తారో? చూడాలి.

9 Replies to “పవన్ ఇక నో షూటింగ్ ఇన్ హైదరాబాద్”

  1. పవన్ సినిమాల గొడవలో పడిపోతే అన్నకు కాస్త రిలీఫ్ గ ఉంటది చంద్రబాబు గారు అయితే వెజిటేరియన్ బోజనమే ఉంటుంది కాబట్టి బయపడాల్సింది లేదు పవన్ ని కెలకక పోవటమే బెస్ట్

Comments are closed.