కూటమి అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ కేడర్ సంతోషంగా లేరు. కూటమిని అధికారంలోకి తెచ్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్ని కలిగిస్తే సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ, ప్రధానంగా గ్రామ స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ కార్యకర్తలు, నాయకత్వం ఉన్నది కేవలం టీడీపీకే. ఈ విషయాన్ని తాడేపల్లిగూడెం సభలో పవన్‌కల్యాణ్ ఎన్నికలకు ముందు జరిగిన సభలో చెప్పిన సంగతి తెలిసిందే.
కూటమి అధికారంలోకి రావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు అమితానందం పొందారు. ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలవుతోంది. అయితే కోరుకున్నవేవీ జరగడం లేదనే ఆవేదన, ఆగ్రహం ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉన్నాయి. మారింది ప్రభుత్వమే తప్ప, తమ బతుకులు కాదనే ఆక్రోశం వారి మాటల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డం తీవ్ర చర్చనీయాంశమైంది. తాము చావలేక బతుకుతున్నామని, శ్రీనుకు ఉన్న కష్టాలే తమకు ఉన్నాయని టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. ఉదాహరణకు ఐటీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యకు పాల్పడితే మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు. అన్నగా కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.
ఎన్ని చెప్పినా శ్రీను ఇంటికి లోకేశ్ వెళ్లలేదు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వంలో ఏ పనీ కావడం లేదనే అభిప్రాయం ప్రతి కార్యకర్త, నాయకుడిలోనూ ఉంది. నిజానికి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే అపరిమితమైన అధికారం దక్కడంలో తామంటే తాము కారణమని వాళ్లంతా భావిస్తున్నారు. అందుకే ఆర్థికంగా తాము ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాలని కోరుకునే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. అలాగే నాయకుల విషయానికి వస్తే, పదవుల్ని ఆశించే వాళ్లు ఎక్కువే. కానీ ఎంత మందికని పదవులు ఇస్తారు? ఇప్పటికే దాదాపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేశారు. భర్తీ చేయాల్సినవి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పదవులు దక్కకపోతే భవిష్యత్‌లో వ్యతిరేకులయ్యే ప్రమాదం వుంది.
అందర్నీ సంతృప్తిపరచడం కష్టసాధ్యమైన పని. అయితే అధికారంలోకి వస్తే ముఖ్యంగా కేడర్‌ని ఉద్ధరిస్తామని చంద్రబాబు, లోకేశ్ భారీ డైలాగ్‌లు కొట్టడాన్ని వాళ్లు చూపుతున్నారు. ఆశ పెట్టడం వల్ల వస్తున్న ఇబ్బందులు. ఏది ఏమైనా టీడీపీ కేడర్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు అసంతృప్తికి ఎలాంటి విరుగుడు ప్రయోగిస్తారో చూడాలి. ఎందుకంటే ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారం వుంది. ఈ లోపు పెద్దాయన ఏదైనా చేయకుండా ఉంటారా? అనే కేడర్ ఆశ, నమ్మకం ఏమవుతాయో చూద్దాం.
Anni posts teesukuni inkaa not happy endi ra. Atla aithe maa janasena ki ivvalsina RS seat kooda ivvaledu. maaku etla vundali?
jagan reddy kotari sankanakinchindi..alage kutamiki kamma kapu
Call boy works 7997531004
వీడికి..కూకటిపల్లి..లో..బాగా..వర్క్..దొరుకుతున్నట్టు..వుంది, అందుకే..విపరీతంగా..పోస్ట్..చేస్తున్నట్టున్నాడు.
vc available 9380537747