ప‌వ‌న్ అధికారంలో వుంటూ డ్రామాలా?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారంలో వుండి మాట్లాడుతున్నారా? డ్రామాలు ఆడుతున్నారా? అని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. క‌డ‌ప‌లో ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ కాకినాడ‌లో సీజ్ చేసిన షిప్ త‌న‌కు…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారంలో వుండి మాట్లాడుతున్నారా? డ్రామాలు ఆడుతున్నారా? అని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. క‌డ‌ప‌లో ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ కాకినాడ‌లో సీజ్ చేసిన షిప్ త‌న‌కు చూపించ‌లేద‌ని ప‌వ‌న్ మాట్లాడ్డం శోచ‌నీయ‌మ‌న్నారు.

కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేస్తూ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు పాల్ప‌డుతున్నార‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి విమ‌ర్శించారు. బాబు ష్యూరిటీ, భ‌విష్య‌త్‌కు గ్యారెంటీ అంటూ ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశార‌న్నారు. ఇప్పుడు బాబు పాల‌న‌లో వీర‌బాదుడుకు గ్యారెంటీ ఇస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

గ‌తంలో చంద్ర‌బాబు బాదుడే బాదుడ‌ని విమ‌ర్శించార‌న్నారు. ఇప్పుడు బియ్యం నుంచి కూర‌గాయ‌ల ధ‌ర‌ల వ‌ర‌కూ అన్నీ పెంచుతూ వీర‌బాదుడు బాదుతున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌లంతా ఇదే ఖ‌ర్మ‌రా బాబూ అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. ఈ ఐదారు నెల‌ల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచార‌ని ఆరోపించారు. ఇప్పుడు క‌రెంట్ బిల్లు ప‌ట్టుకుంటే షాక్ కొట్టే ప‌రిస్థితి వుంద‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు.

బూడిద డ‌బ్బులు పంచుకునేందుకు చంద్ర‌బాబు నేరుగా పంచాయితీలు చేయ‌డం సిగ్గుచేట‌న్నారు. చంద్ర‌బాబు నుంచి ఇలాంటి ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లు అస‌లు ఊహించి వుండ‌ర‌న్నారు.

2 Replies to “ప‌వ‌న్ అధికారంలో వుంటూ డ్రామాలా?”

Comments are closed.