అయ్య‌య్యో.. ర‌ఘురామ కేసులో షాక్‌!

ఉండి టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేసులో ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. వైసీపీ ఎంపీగా ర‌ఘురామ ఉన్న‌ప్పుడు, ఆయన్ను సీఐడీ అరెస్ట్ చేయ‌డం, అనంత‌రం క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్టార‌నే ఆరోప‌ణ‌లు బాధితుడి నుంచి రావ‌డం తెలిసిందే.…

ఉండి టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేసులో ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. వైసీపీ ఎంపీగా ర‌ఘురామ ఉన్న‌ప్పుడు, ఆయన్ను సీఐడీ అరెస్ట్ చేయ‌డం, అనంత‌రం క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్టార‌నే ఆరోప‌ణ‌లు బాధితుడి నుంచి రావ‌డం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వం రాగానే ర‌ఘురామ త‌న‌పై క‌స్ట‌డీలో దాడి చేశార‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సీఐడీ అధికారుల‌పై ఆయ‌న ఫిర్యాదు చేశారు.

ఇందులో భాగంగా నాటి విచార‌ణాధికారి విజ‌య్‌పాల్‌పై కేసు న‌మోదైంది. గుంటూరు వెస్ట్ డీఎస్పీ కార్యాల‌యంలో విజ‌య్‌పాల్‌ను ర‌ఘురామ‌పై దాడి కేసులో విచారించారు. త‌న‌ను విచారించిన అధికారుల‌కు విజ‌య్‌పాల్ చుక్క‌లు చూపారు. ప్ర‌భుత్వానికి కావాల్సిన ఏ ఒక్క స‌మాధానం విజ‌య్‌పాల్ నుంచి రాక‌పోవ‌డం వారిని తీవ్ర నిరాశ‌కు గురి చేస్తోంది. త‌నను చిత‌క్కొట్టిన వాళ్ల‌ను క‌ట‌క‌టాల‌పాలు చేస్తాన‌ని కొంత‌కాలంగా ర‌ఘురామ హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా విచార‌ణ అంశాల్ని ప‌రిశీలిస్తే, అనుకున్న‌ట్టు జ‌రిగేలా లేద‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లో రాసిన ప్ర‌కారం విచార‌ణపై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ నుంచి ర‌ఘురామ‌ను గుంటూరుకు త‌ర‌లించేందుకు ఎవ‌రెవ‌రు వెళ్లార‌నే ప్ర‌శ్న‌కు విజ‌య్‌పాల్ నుంచి స‌మాధానం రాలేదు. చాలా కాల‌మైంద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గింద‌ని, గుర్తు లేద‌ని విజ‌య్‌పాల్ చెప్ప‌డంతో విచార‌ణ అధికారుల‌కు దిమ్మ‌తిరిగిన‌ట్టైంది. 2021, మే నెల‌లో ర‌ఘురామ‌ను హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏదైనా వుంటే కోర్టుకు చెబుతాన‌ని విజ‌య్‌పాల్ తేల్చి చెప్ప‌డంతో విచార‌ణ అధికారుల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి.

అలాగే ర‌ఘురామ‌పై కస్ట‌డీ కేసులో కేసు న‌మోదు కాగానే క‌నిపించ‌కుండా ఎందుకెళ్లారు? సెల్‌ఫోన్‌ను ఎందుకు ఆఫ్ చేశార‌నే ప్ర‌శ్న‌కు షాకింగ్ స‌మాధానం ఇచ్చిన‌ట్టు వారి మీడియానే రాయ‌డం గ‌మ‌నార్హం. రిటైర్ అయ్యాన‌ని, సెల్‌ఫోన్‌లో అధికారుల‌కు ట‌చ్‌లో ఉండాల్సిన ప‌ని లేద‌ని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. అలాగే త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే సెల్‌ఫోన్‌ను వాడుతాన‌ని స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ ర‌ద్దు కావ‌డంతో ఎక్క‌డికెళ్లారు? మీకు ఆశ్ర‌యం ఇచ్చిందెవ‌రిని విజ‌య్‌పాల్‌ను ప్ర‌శ్నించారు. అదంతా త‌న వ్య‌క్తిగ‌తం అని, మీకెందుకు చెప్పాల‌ని విజ‌య్‌పాల్ ఎదురు ప్ర‌శ్నించ‌డంతో షాక్‌లో నోర్మూసుకోవ‌డం విచార‌ణాధికారుల‌ వంతైన‌ట్టు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తే, ర‌ఘురామ కేసులో ముంద‌డుగు పడే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ర‌ఘురామ మంత్రి ప‌ద‌వో, టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వో కోరుకోవ‌డం లేదు. స్పీక‌ర్ కావాల‌నే కోరిక‌ను బ‌య‌ట పెట్టుకున్న‌ప్ప‌టికీ, పార్టీలో మొద‌టి నుంచి ఉన్న అయ్య‌న్న వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. క‌నీసం త‌న‌ను క‌స్ట‌డీలో కొట్టిన వాళ్ల‌కైనా చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష వేయించాల‌ని త‌ప‌న ప‌డుతున్న ర‌ఘురామ‌కు ఏ మేర‌కు న్యాయం జ‌రుగుతుందో! కానీ ఆయ‌న‌కు నిరాశ క‌లిగించే ఫ‌లితాలే రావ‌చ్చ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

30 Replies to “అయ్య‌య్యో.. ర‌ఘురామ కేసులో షాక్‌!”

  1. సిమారు 11 ఏళ్ల నుండి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ట్రైనింగ్ కొట్టి నపుడే వీళ్ళకి తెల్సు ఎలా తప్పించు కోవాలి అనేది వీణ్ణి కూడా అలానే ట్రీట్ చేస్తే అయిపోద్చు ఒక రాత్రి

      1. సన్నాసులకి పోలీస్ కస్టడీ కి జ్యూడిష రేమాండ్ కి తేడా తెలిసిసావాడు

    1. ఆబో మన ట్రైనింగ్ ముందు నీలి ట్రైనింగ్ ఎంత అండి

      కేసు ఫైల్ అవుతూనే PA ni america పంపాలి

      సీఎం అవుతునే మళ్ళీ ఇండియా కి పిలిపించాలి

  2. కస్టడీ లోకి తీసుకుని థర్డ్ డిగ్రీ రుచి చూపిస్తే.. నిజాలు కక్కుతాడు..

    ఒక్కొక్కడినీ కుక్కని కొట్టినట్టు కొడితే.. వాడమ్మమ్మ తల్లి జేజమ్మ కూడా దిగొచ్చి నిజాలు చెపుతారు..

    1. ఇంతకి బోట్లతో ప్రకాశం బ్యారేజి ని గుద్దిన వాళ్ళ మీద FIR file అయ్యిందా

      1. చేశారు మోహన్ గారు.,

        మీ పేరు కూడా చేర్చమంటారా.. FIR లో.. కుమ్మించుకోడానికి “సిద్ధమేనా”..

        1. పాపం సారువారు కుంభకర్ణ నిద్ర నుండి ఇప్పుడే మేల్కున్నట్లు ఉన్నారు…ప్ ఐ ర్ తోపాటు అరెస్టులు కూడా అయ్యాయి అని చెప్పండి

  3. జి*గ్గులు కంటే నీకే బాగా హుషారుగా వున్నట్లు వుంది, పిసు*క్కుంటూ న్నావు,

    ఆ గొడ్డు మాసం తినీ మెదడు వాపు వచ్చిన ఆ దొం*గ గాడు మర్చిపో*యాడు అని చెప్పగానే.

    ఈ బా*నిస బతు*కు చె*త్త గాళ్ళన , సీఐడీ శాఖ లో అధికారిగా పెట్టింది..

  4. ఎవడ్రా చెప్పింది రఘురామా కు న్యాయం జరుగుతుందో లేదో అని, ఎవడికి కావాలి అది? కావాల్సింది రాష్ట్ర పరువు, పోలిసుల పరువు ఉంటుందో లేదో అని. 10 రూపాయల జేబు దొంగను బూటు కాలితో చితకొట్టి నిజం రాబట్టడం లో లేదు హీరోయిజం, ఇటువంటి తల తిక్క సమాధానాల చెప్పే వాడే నుంచి నిజం చెప్పించటం లో ఉంది నిజమైన హెరొఇస్ం. తెలీదు, మరచిపోయాను, నా ఇష్టం జేబు దొంగలు, చిన్న చిన్న నేరాలు చేసేవాలు చెప్పలేక. జీఏ ఎంత హ్యాపీ గా ఉందొ ఈ వ్యాసం రాస్తూ. తూ మీ బతుకులు, ఒక ఎంపీ ను అంతగా….

  5. వీడికి కూడా అరికాళ్ళ కోటింగ్ ఇస్తే అన్ని గుర్తు కొస్తాయి నువ్వు అట్టే టెన్షన్ పడమాక

  6. అదీ కరెక్టే లే… ఇంటరాగేషన్ చేసిన ఆఫీసర్ కి ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మాట్లడకూడదో తెలుసు, ఇలాంటి వాళ్ళకి same treatment ఇస్తే అన్ని నిజాలు తన్నుకొస్తాయి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని సినిమా డైలాగు చెపితే, మళ్ళీ SC చెపుతుంది, వీడిచేత నిజం చెప్పించమని, వీడు కాకపోతే వీడి తల్లో జేజమ్మ చెపుతుంది నిజం ఏమిటో…

  7. “నాకు తెలియదు మర్చి పోయాను ” అంటేనే అర్ధం అవుతోంది చెప్పడం ఇష్టం లేదని.

    ఆ విషయం బయటకు చెప్పకూడదని.

    ఇలాంటి విషయాలు బయటకు కక్కించడంలో పోలీసులు సిద్ధహస్తులు.

  8. అతను మర్చిపోయాను, గుర్తు లేదు అంటే ప్రభుత్వానికి షాక్ ఆ?

    అతన్నికి ముందస్తు బెయిల్ నిరాకరించినప్పుడు ఎవరికి షాక్ ?

    అతను సహకరించట్లేదని రేపో మాపో అరెస్ట్ చేస్తే ఎవరికి షాక్? ఏంటి ఎంకటి నైట్ బిర్యానీ బదులు ఏదన్నా తిన్నావా..

Comments are closed.