శ్రీరామనవమి దేశమంతా జరుపుకుంది. భక్తి శ్రద్ధలతో జనమంతా జై శ్రీరాం అని నినదించారు. ఆయనకు మొక్కుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. పండుగ రోజు సెలవు రోజు ఆట విడుపుగా వీధుల్లోకి పిల్లా పాపలతో వచ్చారు.
రామనవమి రోజున సీతకొండకు ఎక్కడ లేని క్రేజూ మోజూ వచ్చేసింది. ఇంతకీ సీతకొండ ఎక్కడ ఉంది ఏమా స్టోరీ అంటే దాని వెనక బ్యూటిఫుల్ స్టోరీవే ఉంది. విశాఖలో సీతకొండ లేటెస్ట్ అందం. ఆ కొండను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
విశాఖలో జీ 20 సదస్సుని వైసీపీ ప్రభుత్వం గత మూడురోజులుగా నిర్వహిస్తోంది. విదేశీ ప్రతినిధులు అంతా విశాఖను చూసి ఫిదా అవుతూంటే విశాఖ వాసులకు కూడా కొత్త అందాలను ఏర్చి కూర్చింది జీవీఎంసీ. నగర సుందరీకరణలో భాగంగా సీతకొండకు కొత్త రూపును అధికారులు తీసుకువచ్చారు.
విశాఖలో సరికొత్త బ్యూటీఫుల్ స్పాట్ గా దాన్ని మార్చారు. దాంతో విశాఖలోని సీతకొండ అందాలకు చూసి పర్యాటకులు అంతా ముచ్చట పడుతున్నరు. శ్రీరామనవమి రోజున భారీ ఎత్తున సందర్శకులు సీతకొండ అందాలను తిలకించేందుకు వచ్చి పులకించిపోయారు.
విశాఖలో జీ 20 సదస్సు కాదు కానీ ఒక మాదిరిగా ఉన్న సీతకొండను అద్భుతంగా తీర్చిదిద్దారు. బండరాళ్లను అందమైన రూపాలుగా మార్చారు. అక్కడ వివిధ రూపాల్లో బొమ్మలు వేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో సందర్శకుల ఇక్కడ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
విశాఖలో ఎన్నో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఇపుడు సరికొత్తగా కొత్తగా సీతకొండ జత కలుస్తోంది. రామనవమి రోజున సీత కొండ దర్శనం ముక్తీ మోక్షం అని భక్తులతో పాటు పర్యాటకులు భావిస్తున్నారు. జీ 20 సదస్సు విశాఖకు అలా సీతకొండనే ఇచ్చేసింది.