విశాఖ మీద మనసు పారేసుకున్న కేంద్ర మాజీ మంత్రి

విశాఖ మీద మరో రాజకీయ నాయకుడు మనసు పారేసుకున్నారు. ఇప్పటిదాకా విశాఖ వచ్చిన వారు అంతా బ్యూటీ ఫుల్ సిటీ అని అనకుండా లేరు. ఆ వరసలోనే కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు…

విశాఖ మీద మరో రాజకీయ నాయకుడు మనసు పారేసుకున్నారు. ఇప్పటిదాకా విశాఖ వచ్చిన వారు అంతా బ్యూటీ ఫుల్ సిటీ అని అనకుండా లేరు. ఆ వరసలోనే కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు సైతం విశాఖ వంటి సుందర నగరం ఎక్కడా లేదని కితాబు ఇచ్చారు.

విశాఖలో తాను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఆయన వేడి నిట్టూర్పులు విడిచారు. విశాఖలో ఉంటూ పనిచేసే అవకాశం ఉన్న వారు అంతా లక్కీ అని తెగ పొగిడారు. తాను కూడా అలాంటి చాన్స్ కోసం ఎదురుచూశానని, అయితే రాలేదని ఆయన వేదన చెందారు

విశాఖలో నివాసం ఉన్నా పనిచేసినా చదువుకున్నా అన్నీ కూడా అదృష్టం మేరకే లభిస్తాయని ఆయన అన్నారు. విశాఖలో ఐఐఎం విద్యార్ధులు ఉంటూ చదువుకుంటున్నారు అంటే వారి కంటే భాగ్యం ఎవరికైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

తనకు కూడా ఐఐఎం లో చదువుకోవాలని ఉందని, కానీ తాను ఐఐఎం స్నాతకోత్సవానికి అతిధిగా మాత్రమే రాగలిగాను అని సురేష్ ప్రభు చెప్పారు. విశాఖకు అతిధిగా రావడం అనే లక్ తనకు ఉందని, విశాఖ మాత్రం తన మనసు దోచేసిందని సురేష్ ప్రభు అంటున్నారు.

ఇప్పటిదాకా విశాఖ గురించి ఎక్కువగా మాట్లాడిన వైసీపీ నేతలు మంత్రులు ఇటీవల కొంత తగ్గారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో విశాఖ చుట్టూనే అంతా తిప్పి మాట్లాడిన వైసీపీ ఏలికలు తాజా పరిణామాల నేపథ్యంలో నోరు మెదపడంలేదు. ఆ లోటుని తీర్చే విధంగా బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి విశాఖను తెగ మెచ్చేసుకుంటున్నారు. విశాఖకు తాను పెద్ద ఫ్యాన్ అని అంటున్నారు.