అయ్యన్నపై ఓ రేంజ్‌లో సెటైర్స్‌!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిపై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ దీపావ‌ళి ట‌పాసుల్లా పేలుతున్నాయి. వైసీపీ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే క్ర‌మంలో గ‌త కొంత కాలంగా అయ్య‌న్న నోటికి హ‌ద్దూ అదుపూ లేకుండా…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిపై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ దీపావ‌ళి ట‌పాసుల్లా పేలుతున్నాయి. వైసీపీ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే క్ర‌మంలో గ‌త కొంత కాలంగా అయ్య‌న్న నోటికి హ‌ద్దూ అదుపూ లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌కిలీ డాక్యుమెంట్ల‌ను కోర్టుకు స‌మ‌ర్పించార‌నే కార‌ణంతో అయ్య‌న్న‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

అయ్య‌న్న అరెస్ట్‌పై టీడీపీ చిందులు తొక్కుతోంది. అయ్య‌న్న అరెస్ట్ ఉత్త‌రాంధ్ర‌పై దాడి అని ఒక నాయ‌కుడంటే, మ‌రొకాయ‌న బీసీల‌పై దాడిగా అభివ‌ర్ణించి అభాసుపాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న అరెస్ట్‌పై నెటిజ‌న్లు సృత‌నాత్మ‌క పోస్టులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయ వార‌స‌త్వాల‌కు అగ్ర‌జుడ‌ని అయ్య‌న్నను వెట‌క‌రించ‌డం గ‌మ‌నార్హం. అలాగే అయ్య‌న్న నోరు తెరిస్తే వేదం, కాలు క‌దిపితే ధ‌ర్మం…అలాంటి నాయ‌కుడిని అరెస్ట్ చేయ‌డం నేర‌మంటూ క‌వితాత్మ‌కంగా సెటైర్స్ విసర‌డం ఆక‌ట్టుకుంటోంది. భార‌తీయ చ‌ట్టాల‌ను అయ్య‌న్న‌పై అమ‌లు చేయ‌కూడ‌ద‌ని మ‌రికొంద‌రు వెట‌క‌రించారు.

ఆయనో ప్రత్యేక 'పురుషుడు', అంతకుమించి చంద్రబాబు 'లక్షణాలను' పునికి పుచ్చుకున్న 'ధర్మజుడు' ! అంటూ దెప్పి పొడిచారు. ఇలా అయ‌న్న‌ను నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు.