ఉద్యోగులూ ఉద్యమాలు ఆపొద్దంతే

ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తే నష్టం ఎవరికి. సాధారణ ప్రజలకు. ప్రజల కోసం ఆలోచించే వారు ఎవరైనా ఉద్యమాలు వద్దు అనే అంటారు. కానీ విపక్షాలకు మాత్రం ఉద్యమాలు కావాలనిపిస్తోందిట. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్…

ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తే నష్టం ఎవరికి. సాధారణ ప్రజలకు. ప్రజల కోసం ఆలోచించే వారు ఎవరైనా ఉద్యమాలు వద్దు అనే అంటారు. కానీ విపక్షాలకు మాత్రం ఉద్యమాలు కావాలనిపిస్తోందిట. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే ఉద్యమాలు ఆపకండి అని వారికి సలహా ఇస్తున్నారు. మీ వెనక అండగా బీజేపీ ఉంది. మీరు పోరాడండి, పోయేది ఏమీ లేదు అని కమ్యూనిస్టుల తరహాలో ఉత్సాహ పరుస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని సోము వీర్రాజు అన్నారు.హామీలు ఇచ్చి ఊరుకుంటున్నారు తప్ప వారి గురించి పట్టించుకోవడం లేదు అని విమర్శించారు.ఉద్యోగుల సమస్యలు ఉంటే ప్రభుత్వం చూడాల్సిందే. వాటిని పరిష్కరించాల్సిందే. అయితే ఉద్యోగులు ఆందోళన బాట పట్టకుండా బాధ్యత కలిగిన విపక్షాలు అటూ ఇటూ సందేశం ఇవ్వాల్సి ఉంటుంది.అలాగే సర్ది చెప్పాల్సి ఉంటుంది.

కానీ మీరు ఉద్యమాలు చేయండి మీ వెనక మేము ఉంటామని రెచ్చగొట్టే రాజకీయమే విపక్షాలు ఏపీలో చేస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. సామరస్య పూర్వక వాతావరణం తెచ్చే విధంగా కానీ అలాగే ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలకు తగిన సూచనలు ఇచ్చే విధంగా కానీ విపక్షాలు చేయడం మరచాయా అన్నదే డౌట్ అంటున్నారు. 

ఉద్యోగుల ఉద్యమం పేరిట చలి కాచుకోవడానికి విపక్షాలు చూస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే కదా.