సస్పెన్స్ క్రియేట్ చేశాడు …గప్పాలు కొట్టాడు

బీజేపీకి తెలంగాణలో చెప్పుకోవడానికి అంతో ఇంతో సీన్ ఉంది. కానీ ఏపీలో లేదు. లేని దృశ్యాన్ని క్రియేట్ చేయడానికి నానా రకాలుగా తిప్పలు పడుతున్నాడు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మరి పదవిలో…

బీజేపీకి తెలంగాణలో చెప్పుకోవడానికి అంతో ఇంతో సీన్ ఉంది. కానీ ఏపీలో లేదు. లేని దృశ్యాన్ని క్రియేట్ చేయడానికి నానా రకాలుగా తిప్పలు పడుతున్నాడు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మరి పదవిలో ఉన్నప్పుడు గమ్మున కూర్చుంటే ఎలా? ఏదో జరుగుతుందని, జరిగిపోతోందనే ఉత్కంఠ కలిగించాలి కదా. 

ఇక మావల్లే అది జరిగింది, ఇది జరిగింది, ప్రభుత్వాన్ని వణికిస్తున్నాం …అంటూ సోమూ గప్పాలు కొడుతున్నాడు. కానీ చెవుల్లో ఆయన పువ్వులు పెడితే పెట్టుకోవడానికి జనం సిద్ధంగా లేరు. ఆయన చెప్పింది నమ్మేయడానికి అధిష్టానం కూడా సిద్ధంగా లేదు.  ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పాడు సోము వీర్రాజు. 

ఎవ్వరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అన్నాడు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం (కొంపదీసి సోమును తొలగించరు కదా) తీసుకోబోతున్నదట.  

రాజకీయ పరిణామాలు ఏ  విధంగా, ఎలా జరుగుతాయో ఎవ్వరికీ అర్థం కాదట. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు జరుగుతాయన్నాడు సోము. అబ్బా …సస్పెన్సుతో చంపేస్తున్నావ్ సోము. నరాలు తెగిపోయే ఉత్కంఠను కలిగిస్తున్నావ్. ఎవ్వరికీ భయపడని జగన్ భయపడేది నరేంద్ర మోడీకేనని అన్నాడు.

ఇందులో కొంత వాస్తవ వుందనే అనిపిస్తోంది. వైసీపీని గద్దె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశాడు. ఇది మాత్రం జరిగే పని కాదు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితో ప్రభుత్వం దిగొచ్చిందన్నాడు. జగన్ ప్రభుత్వాన్ని వణికించిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చాడు. విగ్రహాలు, రథాలను ధ్వంసం చేస్తే బీజేపీ పోరాటం చేసిందన్నాడు. రామ తీర్థం నుంచి కపిల తీర్థం వరకు యాత్ర  చేస్తామంటే జగన్ ప్రభుత్వం దిగొచ్చిందన్నాడు.