మీసం తిప్ప‌డంపై బాల‌కృష్ణ‌కు స్పీక‌ర్ వార్నింగ్!

అసెంబ్లీలో మీసం తిప్ప‌డంపై హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు స్పీక‌ర్ వార్నింగ్ ఇచ్చారు. వెకిలి చేష్ట‌ల‌తో శాస‌న‌స‌భ గౌర‌వ సంప్ర‌దాయాల‌ను ఉల్లంఘించ‌డం మంచిది కాద‌ని.. ఇది మొద‌టి త‌ప్పిదంగా భావించి క్ష‌మించి వ‌దిలేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  Advertisement…

అసెంబ్లీలో మీసం తిప్ప‌డంపై హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు స్పీక‌ర్ వార్నింగ్ ఇచ్చారు. వెకిలి చేష్ట‌ల‌తో శాస‌న‌స‌భ గౌర‌వ సంప్ర‌దాయాల‌ను ఉల్లంఘించ‌డం మంచిది కాద‌ని.. ఇది మొద‌టి త‌ప్పిదంగా భావించి క్ష‌మించి వ‌దిలేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

మ‌రోవైపు శాస‌న‌స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగిన టీడీపీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ సస్సెండ్ చేశారు. 14 మందిపై ఒకరోజు స‌స్పెష‌న్ వేటు వేయ‌గా.. వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, ప‌య్యావుల కేశ‌వ్‌ను ఈ సెష‌న్ మొత్తం సస్పెండ్ చేశారు.

కాగా శాసనసభ సమావేశాలు మొదలైన సమయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ స‌భ్యులు బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టి నానా గందరగోళం సృష్టించారు. స్పీకర్ 10 నిమిషాల సభను వాయిదా వేసి తిరిగి ప్రారంభించిన కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాక‌పోవ‌డంతో టీడీపీ స‌భ్యుల‌ను సస్పెండ్ చేశారు.

టీడీపీ స‌భ్యులు సస్పెండ్ కావ‌డంతో బీఏసీ స‌మావేశానికి రాబోమ‌ని టీడీపీ నేత‌లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు స‌భ‌లో ఏ అంశం చ‌ర్చ‌కు రావాల‌న్నా బీఏసీకి రావాల్సిందేన‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.