జానపదాల సత్తా చాటుదాం

మనకు మంచి జానపదాలు వున్నాయని, కానీ వాటిని సినిమాల్లో వాడదాం అంటే ఏదో వైపు నుంచి ఎవరో ఒకరు అల్లరి పెట్టడం కామన్ అయిపోయిందని, అందుకే వాడేందుకు జంకాల్సి వస్తోందని నిర్మాత బన్నీ వాస్…

మనకు మంచి జానపదాలు వున్నాయని, కానీ వాటిని సినిమాల్లో వాడదాం అంటే ఏదో వైపు నుంచి ఎవరో ఒకరు అల్లరి పెట్టడం కామన్ అయిపోయిందని, అందుకే వాడేందుకు జంకాల్సి వస్తోందని నిర్మాత బన్నీ వాస్ అన్నారు. లేదూ అంటే మన జానపదాలు ఈ జనరేషన్ లో కూడా బాగా పాపులర్ అవుతాయన్నారు. 

కోటబొమ్మాళి పిఎస్ సినిమాలో వాడిని శ్రీకాకుళం జానపద గీతం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో బన్నీవాస్ మాట్లాడుతూ, ఈ పాట వాడడానికి ముందు చాలా ఆలోచించాల్సి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు దానికి తగిన ఫలితం దొరికిందన్నారు.

మలయాళ మాతృకను తీసుకుని చేస్తున్న కోటబొమ్మాళి పిఎస్ ఓ కొత్త తరహా కమర్షియల్ సినిమా అని ఆయన అన్నారు. ఈ సినిమాతో మిధున్ ముకుందన్ ను తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామన్నారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ వీళ్లందరికీ ఈ సినిమా కొత్తగా వుంటుందని అన్నారు. అదే విధంగా ఈ సినిమాతో మెగాస్టార్ తోడల్లుడి కుమార్తె విద్య కూడా నిర్మాతగా పరిచయం అవుతున్నారని అన్నారు.

దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ, తనకు వున్న శ్రీకాకుళం నేపథ్యంతో ఈ సినిమాను పూర్తిగా అదే బ్యాక్ డ్రాప్ లో తీసామన్నారు. ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. టీమ్ అంతా కలిసే ఒరిజినల్ ను తెలుగుకు సరైన విధంగా అడాప్ట్ చేసామన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాతో హీరోయిన్ కు శివాని రాజశేఖర్ కు మంచి పేరు వస్తుందన్నారు. ఆమె నటన విషయంలో పెర్ ఫెక్షన్ కోసం తపించే తీరు తనకు నచ్చిందన్నారు. తనకు కూడా తన పాత్ర బాగా నచ్చిందన్నారు.

ఇంకా ఈ ఫంక్షన్ లో గీతా బాబు, ఇతర సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.