జగన్ కు థ్యాంక్స్ చెప్పిన సీనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఆత్మకు ఆయన వారసులు శాంతి చేకూర్చారా లేదా అనేది ఎగతెగని చర్చకు దారితీస్తుంది. దీనిపై రెండు పార్టీల జనాలు రెండు రకాలుగా స్పందిస్తారు.  Advertisement చంద్రబాబును జగన్ సర్కారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు…

ఎన్టీఆర్ ఆత్మకు ఆయన వారసులు శాంతి చేకూర్చారా లేదా అనేది ఎగతెగని చర్చకు దారితీస్తుంది. దీనిపై రెండు పార్టీల జనాలు రెండు రకాలుగా స్పందిస్తారు. 

చంద్రబాబును జగన్ సర్కారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సందర్భంగా వెలిసిన ఓ ఫ్లెక్సీ, ఇప్పుడీ చర్చకు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

చంద్రబాబును జైలుకు పంపించిన జగన్ కు సీనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పిన ఫ్లెక్సీ వెలిసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారింది.

“థ్యాంక్యూ జగన్, నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి, నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకొని, నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా, వీడి కుటిల రాజకీయాలకు వాడుకొని, చివరికి నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న, ఈ నీచుడికి బుద్ధి చెప్పి, నా ఆత్మకు శాంతిని చేకూర్చావు.”

ఇలా ముఖ్యమంత్రి జగన్ కు సీనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పినట్టుగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. అయితే ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటుచేశారనే అంశంపై క్లారిటీ లేదు.  

సెప్టెంబర్ 10న చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంగా.. ఆరోజును తెలుగు ప్రజలంతా ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసినట్టు ఆ ఫ్లెక్సీలో ఉంది.