బాబు స్కిల్ కేసులో ఇంప్లీడ్ అయిన జ‌ర్న‌లిస్టుపై అస‌హ‌నం!

చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డంతో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌స్టిస్ బేలా త్రివేది స్ప‌ష్టం చేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో ప్ర‌భుత్వ మార్పుతో కేసు న‌మోదు చేసిన సీఐడీ కూడా బెయిల్‌పై అభిప్రాయాన్ని మార్చుకోవ‌డం విశేషం. వైసీపీ ప్ర‌భుత్వం బాబు బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌నే పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

చంద్ర‌బాబు స్కిల్‌లో స్కామ్‌కు పాల్ప‌డ్డార‌న్న అభియోగంపై ఆయ‌న్ను సీఐడీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 50 రోజుల‌కు పైగా ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. అనంత‌రం ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ ఆదేశాల‌ను నాటి జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. సుప్రీంకోర్టులో జ‌స్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచారించింది. చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డంతో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌స్టిస్ బేలా త్రివేది స్ప‌ష్టం చేశారు.

అయితే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ సీఐడీనే ప్ర‌భుత్వ ఆధ్వర్యంలో న‌డుస్తుంటే, ఇక ఎవ‌రు? ఎవ‌రిని విచారించాలో? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇదిలా వుండ‌గా ఈ కేసులో ఇంప్లీడ్ అయిన జ‌ర్న‌లిస్టు తిలక్‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

బాబు బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ జ‌ర్న‌లిస్టు తిల‌క్ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ర‌ద్దు చేయాల‌ని కోర‌డానికి మీరెవ‌రు? మీకున్న అర్హ‌త ఏంట‌ని న్యాయ స్థానం నిల‌దీసింది. మూడో వ్య‌క్తికి ఏం ప‌ని అని సుప్రీంకోర్గు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

12 Replies to “బాబు స్కిల్ కేసులో ఇంప్లీడ్ అయిన జ‌ర్న‌లిస్టుపై అస‌హ‌నం!”

  1. చెప్పాల్సింది….సూర్యుడు ఉదయించగానే స్టేక్షి ఛానల్ లో హాజరు వేయించుకుని ఏఆర్నలిస్ట్ అని

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. Real News!!

    స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది.

    గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

    .

    1. ఎవరొ మీకు సంబందం లెని జొర్నొలిస్ట్ ఇంప్లీడ్ అయ్యడా? ఏమి పట్టిత్తు కబుర్లురా?

      నువ్వు గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను గురించి మాత్రం మాట్లాడవెమి గురువిందా?

  4. ////The Supreme Court also expressed strong disapproval of Swarnandhra Patrika journalist Bal Gangadhar Tilak, who had filed an interlocutory application to cancel Chandrababu Naidu’s bail. The bench questioned the journalist’s standing in the matter, asking, “Who are you? What is your relationship with the case? What is your eligibility to file a PIL?” Justice Trivedi criticized the involvement of an unrelated third party in bail matters and warned of serious consequences for such actions in the future. The interlocutory application was dismissed./////

    .

    deccanchronicle.com/southern-states/andhra-pradesh/skill-development-case-supreme-court-dismisses-bail-cancellation-plea-against-chandrababu-naidu-1854229

    1. ఈ తిలక్ గురించి అందరికీ తెలిసిందె!

      జగన్ మార్గదర్సి చిట్ ఫండ్స్ మీద కెసు పెడితె, ఈయనే అప్పట్లొ అనెక చొట్ల ఉండవల్లి చెత సబలు పెట్టించి గోల గోల చెయించింది!.

      దీని బట్టి ఈయన ఎవరి తాలూకొ అర్ధం అవుతుంది.

Comments are closed.