‘సంక్రాంతి’కి కూడా సీక్వెల్ తీస్తాడా?

ఎఫ్2 సినిమా హిట్టవ్వడంతో ఎఫ్3 తీశాడు అనీల్ రావిపూడి. ఈసారి కాస్త ముందుగానే సీక్వెల్ కు హింట్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

ఎఫ్2 సినిమా హిట్టవ్వడంతో ఎఫ్3 తీశాడు అనీల్ రావిపూడి. ఈసారి కాస్త ముందుగానే సీక్వెల్ కు హింట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ సినిమా క్లయిమాక్స్ లో దర్శకుడు ప్రత్యక్షమయ్యాడు. పిట్ట గోడపై కూర్చొని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, మరో పండక్కి కలుద్దాం అంటూ సీక్వెల్ పై హింట్ ఇచ్చాడు. సినిమాను ముగించడం కూడా అలానే ఉంది.

సినిమాలో వెంకటేష్ మాజీ ప్రేయసిగా మీనాక్షి నటించగా, భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించింది. క్లయిమాక్స్ లో ఎక్కడో ఉన్న మీనాక్షి, వెంకటేష్ ఎదురింట్లో దిగుతుంది. తనకు ట్రాన్సఫర్ అయిందని చెబుతుంది.

అలా హీరో ఇంట్లో భార్య, ఎదురింట్లో మాజీ ప్రియురాల్ని సెట్ చేసి శుభం కార్డ్ వేశాడు అనీల్ రావిపూడి. ఇలా ఓపెన్ ఎండ్ తో సినిమాను ముగించి, సీక్వెల్ కు కావాల్సిన లీడ్ ను ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాడు.

నారీనారీ నడుమ మురారి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఏవండీ ఆవిడ వచ్చింది టైపులో ఎప్పుడు కావాలంటే అప్పుడు సీక్వెల్ తీసుకోవచ్చు రావిపూడి.

2 Replies to “‘సంక్రాంతి’కి కూడా సీక్వెల్ తీస్తాడా?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.