ఆయన పీఠాధిపతి. విశాఖ అంటే అందంతో పాటు ఆధ్యాత్మికత కూడా గుర్తుకు వస్తుంది. అలా శారదాపీఠం ఇప్పటికి ముప్పయ్యేళ్ళుగా విశాఖలో నడుస్తోంది. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు పీఠాన్ని సందర్శించిన వారు ఉన్నారు. ప్రముఖులు ఎంతో పీఠానికి వచ్చిన వారూ ఉన్నారు.
ఆ పీఠానికి అధిపతిగా మూడు దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న వ్యవస్థాపకుడు అయిన స్వరూపానందేంద్ర స్వామీజీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పీఠాన్ని త్యజించబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. తనకు 2024 నాటికి అరవై ఏళ్ళు వస్తాయని, తన షష్టి పూర్తి వేళకు పీఠాన్ని వదిలి ఉత్తరాధికారి శ్రీ స్మాత్మానందేంద్ర స్వామీజీకి బాధ్యతలు అప్పగిస్తాను అని ప్రకటించారు.
తాను జీవితం మొత్తం హిందూ ధర్మ ప్రచారానికి వేద సభల నిర్వహణకు కేటాయిస్తానని ఆయన వెల్లడించారు. తాను దేశమంతా తిరిగి ఆ పనిలో ఉంటానని పీఠం బాధ్యతల నుంచి మాత్రం తప్పుకుటానని ఆయన చెప్పడం విశేషం.
శారదాపీఠం అంటే స్వామీజీయే గుర్తుకు వస్తారు. ఆయన పీఠాన్ని త్యజించడం అంటే ఒక విధంగా ఆలోచించాల్సిన విషయమే అనుకోవాలి. రాజకీయ ప్రముఖులతో విశేష పరిచయాలు ఉన్న స్వామి పీఠాన్ని వదిలేసిన తరువాత ప్రముఖుల కోరికలను ఈడేర్చేందుకు యాగాలు, యజ్ఞాలు కూడా నిర్వహిస్తారా అన్నది చూడాల్సి ఉంది. స్వామీజీ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మాత్రం వెల్లడించలేదు.