త‌ల్లికి వంద‌నం… వ‌చ్చే ఏడాదే!

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనుమానాలకు తెర‌దించారు. మండ‌లిలో ఆయ‌న మాట్లాడుతూ అంద‌రితో చ‌ర్చించి వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. లోకేశ్ నిజాయితీని త‌ప్ప‌క…

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనుమానాలకు తెర‌దించారు. మండ‌లిలో ఆయ‌న మాట్లాడుతూ అంద‌రితో చ‌ర్చించి వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. లోకేశ్ నిజాయితీని త‌ప్ప‌క అభినందించాలి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తారో చెప్ప‌కుండా, నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని ఎప్పుడు అమ‌లు చేసేది లోకేశ్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈ ప‌థ‌కాన్ని ఇప్ప‌టి నుంచే అమ‌లు చేస్తార‌ని త‌ల్లిదండ్రులు, విద్యార్థులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే, అంద‌రికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామ‌ని చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల్లో ప్ర‌తి త‌ల్లి ఖాతాకు రూ.15 వేలు జ‌మ చేస్తామ‌ని పేర్కొన్నారు.

దీంతో చంద్రబాబు ప్ర‌భుత్వం మోస‌గిస్తోంద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే త‌ల్లికి వంద‌నంపై ఎన్నిక‌ల‌కు తాము ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని లోకేశ్ మండ‌లిలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌థ‌కాన్ని ఎలా అమ‌లు చేయాల‌నే దానిపై గైడ్‌లెన్స్ రూపొందించే ప‌నిలో ఉన్నామ‌ని, కొంత స‌మ‌యం కావాల‌ని ఆయ‌న అడిగారు. దీన్ని తాను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు లోకేశ్ తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన లోటుపాట్లు పున‌రావృతం కాకూడ‌ద‌నేదే త‌మ‌ ల‌క్ష్యమ‌న్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల విద్యార్థులంద‌రికీ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ప్ర‌భుత్వ విద్యార్థుల‌కు మాత్ర‌మే ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తార‌ని ఇటీవ‌ల పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దానికి ఫుల్‌స్టాప్ పెడుతూ లోకేశ్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం మంచి ప‌రిణామం. అయితే ఒక ఏడాది త‌ల్లికి వంద‌నం డ‌బ్బు పోతోంద‌నే ఆవేద‌న చాలా మందిలో వుంది.

40 Replies to “త‌ల్లికి వంద‌నం… వ‌చ్చే ఏడాదే!”

  1. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

      1. ఇలా అప్దాలు చెప్పి ప్రజలను మోసం చెయ్యటం.. రెడ్ బుక్ నీ గుడ్డలో పెట్టుకు తిరగటం.. మీకే సొంతం పచ్చనయాల

  2. All the welfare schemes, development works.will.go to winds. Only Amaravathi works 30% and payments to their.contractors will happen in this 5 years. Will sing regular “yedupu song” no funds, no money, no oans..

  3. మన విద్యా మంత్రి లోకేష్ బాబు కూడా . ఆంధ్ర తల్లిలకి వెన్నుపోటు 

    తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో పిల్లలకు ఆస్తులు ఇస్తారు 

    మన బాబు గారు “వెన్నుపోటు ను” వారస్తం గా ఇచ్చారు లోకేష్ బాబు కి.

    ఎలేచ్షన్స్ ముందు 

    ఎన్ని కల ముం దు ఒక ఇం ట్లో ఎం త మం ది పిల్లలం టే అంత మందికి రూ. 15,000 ఆర్థిక

    సహాయం 

    ఎలేచ్షన్స్ తరువాత 

    15,000 ఆర్థికసహాయం అం టూ జీవో 29 పేరిట ఉత్తర్వు లు జారీ చేసిం ది . ఒక్కరికి మాత్రమే 

    ఇంకో 3-4 నెల తరవాత

    ఎవ్వరికి ఒక్క రూపాయీ ఇవ్వరు . మొత్తం కే-బ్యాచ్ స్వాహా

  4. జనాలు పిచ్చి వాలు . ఇంకా నమ్ముతున్నారు వేళ్ళని .
    ఒక సంవత్సరం తర్వాత. ప్రజలు దాని గురించి మరచిపోతారు.
    అది బాబు ప్లాన్ .

  5. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

  6. What kootami is doing is right. They will delay these as long as possible. They shouldnt give these schemes. Already central Government increased LTCG and STCG taxes by 25% yesterday. Tax payers are literally suffering with these free schemes. Kootami is doing its best to stop these mindless welfare schemes and is just focusing on development.

  7. Looks like name of Pasupu Kumkuma has been renamed as Talli ki vandanam scheme but execution remains same. Funds will only be disbursed closer to next elections.

  8. Need not worry about AP public. In a year, people forget everything and gets erased everything from their memory — so alliance 3 heads can happily enjoy the resources for the rest of the time

  9. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    రైతు భరోసా అతీగతీ లేదు.

    ఉచిత బస్సు కృష్ణాలో కలిపేశారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళ ఇళ్లల్లో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    ఒసేయ్ ఆంధ్రదేశమా…నీకు మంచి రోజులా…

    వదల బొమ్మాళీ…వదల బొమ్మాళీ…వదల

    పిందె…పండయ్యిందే….

    (19-24) సంక్షేమం, అభివృద్ధితో కళకళలాడుతుందే

    వదల బొమ్మాళీ…వదల

    అంటూ పసుపుపతి మిమ్మల్ని మాయలో ముంచేశాడు…

    ఇప్పుడు ఘోరమైన పాలనా చూస్తూ roju ఏడవటమే ఆంధ్రుల పని.

Comments are closed.