రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్‌లో వస్తోంది. ఈ సినిమా పొలిటికల్, సోషల్ అవేర్ నెస్ బ్యాక్ డ్రాప్ లో అల్లుకున్న కథ అని ఇప్పటి వరకు వున్న ప్రచారం. అయితే రెండు కొత్త విషయాలు వెల్లడించారు సంగీత దర్శకుడు థమన్.
గేమ్ ఛేంజర్ ఫక్తు కమర్షియల్ మీటర్ లో వుంటుందట. అదే సమయంలో ఓ మ్యూజికల్ జర్నీగా కూడా వుంటుందట. సినిమాలో మొత్తం ఏడు పాటలు వుంటాయని థమన్ వెల్లడించారు. ఏడు పాటలు ఓ పెద్ద సినిమాలో వుండడం అంటే మామూలు విషయం కాదు.
ఇప్పటికే ఓ పాట విడుదల చేశారు. అగస్ట్ లో మరో పాట విడుదల చేస్తారట. సినిమాలో పాటలు అన్నీ అధ్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరో.. ఏడు పాటలు, ఫైట్లు, కమర్షియల్ స్టఫ్ అంటే ఫ్యాన్స్ కు ఫుల్ పండగే అన్నమాట.
ఇండియన్ 2 సినిమాతో శంకర్ తన ఫ్లాపుల పరంపర మరోసారి కొనసాగించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మాత్రమే ఊపిరపోయాలి. గేమ్ ఛేంజర్ హిట్ హీరో చరణ్ కన్నా, నిర్మాత దిల్ రాజు కు దర్శకుడు శంకర్ కు చాలా అవసరం. ఖర్చు రీత్యా చాలా పెట్టుబడి పెట్టారు. సినిమా మీద ఫ్యాన్స్ చాలా హొప్స్ పెట్టుకున్నారు. థమన్ చెప్పిన మాటలు కొంత ఊపిరి పోస్తున్నాయి ఫ్యాన్స్ అంచనాలకు.
Director has one more daughter ready for marriage, he needs a lot of money and he’s doing movies lacking common sense.
జనం పట్టించుకోరు
జనం పాటలను స్కిప్ చేస్తారు ఓటిటిలో